అమ్మ ఒడితో అంతా మారింది..భారీగా కోత పడింది..!

-

ఏపీలోని విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రవేశ పెట్టిన పథకాలలో ఒకటి అమ్మ ఒడి..గత రెండేళ్లు ఎటువంటి కోత లేకుండా మొత్తం డబ్బులను తల్లుల ఖాతాలోకి జమ చేశారు..నిన్న తాజాగా మూడో విడత డబ్బులను కూడా జమ చేశారు.అయితే గతంలో ఉన్న విధంగా అయితే లేదని, డబ్బులు అందరికి రాలేదని, వచ్చిన డబ్బుల లో కూడా తగ్గించి ఇచ్చారని తల్లులు వాపోతున్నారు.

అమ్మ ఒడి సొమ్ముపై జిల్లా వ్యాప్తంగా సోమవారం జరిగిన సంభాషణలు ఇవి. శ్రీకాకుళం జిల్లాలో సీఎం వైఎస్‌ జగన సోమవారం మధ్యా హ్నం బటన్‌ నొక్కి, ‘అమ్మ ఒడి డబ్బులు మీ ఖాతాల్లోకి వేస్తున్నా..’ అని ఆర్భాటంగా ప్రకటించారు. జగనన్న అమ్మ ఒడి సొమ్మును వేసేశారని జిల్లాలో అధికారులు, ప్రజాప్రతినిధులు సైతం ప్రకటించారు. జిల్లాలో 2.16 లక్షల మందికి రూ.325.26 కోట్లు జమ అయ్యాయని అన్నారు. కానీ లక్షలాది మంది అమ్మల మదిలో ఒకటే ఆందోళన. చాలామందికి డబ్బులు జమ అయినట్లు ఎలాంటి స్పందన రాలేదు..

అమ్మఒడి కింద రూ.15 వేలు ఇస్తామన్న జగన్‌ కోత కొసాడు..మరుగుదొడ్ల నిర్వహణ ఫండ్స్‌ పేరిట రూ.1000, పాఠశాల నిర్వహణ ఫండ్‌ పేరిట మరో రూ.1000 కోతపెట్టాడు. ఈ ఏడాది రూ.2 వేలు తగ్గించి, రూ.13 వేలు మాత్రమే ఇస్తామని ప్రకటించాడు.అమ్మ ఒడి కార్యక్రమానికి విద్యార్థులను, తల్లిదండ్రులను బలవంతంగా రప్పించారు. కానీ షామియానాలు, కుర్చీలు తగినన్ని ఏర్పాటు చేయలేదు.

చాలామంది ఎండలోనే ఉండాల్సి వచ్చింది. మరికొందరు విద్యార్థులు, తల్లులు, అధికారులు చెట్లకింద, వరండాలో కూర్చోవాల్సి వచ్చింది. అవస్థలు పడలేక సభ జరుగుతున్నప్పుడే చాలా మంది వెళ్లిపోతుండగా, అక్కడి సిబ్బంది అడ్డుకున్నారు. కార్యక్రమం పూర్తయ్యేదాకా ఉండాలని వెనక్కు తీసుకెళ్లి బలవంతంగా నిలబెట్టారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, మున్సిపల్‌ స్కూళ్ల నుంచి హెచఎంలు, టీచర్లను సైతం బలవంతంగా రప్పించారు.. మొత్తానికి సభ ఖాళీ అయ్యింది. మరి డబ్బులు రాని వారి పరిస్థితి మాత్రం దారుణంగా మారింది..ఈ విషయం పై అధికారులు ఎలా స్పందిస్తారో,పడని వారికి ఏం చెబుతారో అని తల్లులు, పిల్లలు ఆందోళనలో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news