ప్రత్యేకంగా ఆడవాళ్ళు ధరించే రత్నాలు ఏవో తెలుసా?

-

ఇప్పుడు కాలం మారింది..దాంతో పాటే ఆచార వ్యవహారాలు కూడా మారయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..చాలా మంది రంగు రాళ్లను స్టైల్ కోసం వాడుతున్నారు. పెట్టుకున్న వాల్లే రెండు మూడు ధరిస్తూ కనిపిస్తున్నారు. అయితే ఈ సంప్రదాయ పురాతన కాలం నుంచే ఉంది..ఒకప్పుడు ఆడవాళ్ళూ పూర్వం ఆడ వాళ్లు ముత్యం, పగడం, నల్ల పూసలు, రవ్వలు,వజ్రాలు సౌభాగ్య ప్రదము అని తప్పని సరిగా ధరించాలి అని పెద్దలు చెబుతుండేవారు.

మంచి వస్తు ధారణ ప్రభావంగా ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. వజ్రపు ముక్కు పుడక, వజ్రపు కర్ణ ఆభరణములు, అలంకరణ విషయములో ప్రత్యేకతను పొంది ఉండేవి.అంతేకాదు పగడాలు, ముత్యాలు, సౌభాగ్య చిహ్నాలు అని చెప్పాలి.ప్రాచీన సాంప్రదాయం నడిపే కుటుంబాలలో ఆడవారి మంగళ సూత్రాలలో, నల్లపూస, పగడం, ముత్యం వేసి తాడు కట్టుకునే అలవాటు మనం చూడవచ్చు. అంతే కాదు చాలా మంది నల్ల పూసల దండను వేస్కుంటూ ఉంటారు.

స్టైల్ కోసం మంగళ సూత్రాలు పక్కన పెట్టి కేవలం నల్ల పూసల దండలను, ఇతర చైన్ లను కూడా వాడే వాళ్లు మనకు రోజూ కనిపిస్తూనే ఉంటారు..ఇప్పుడు నవరత్నాల వాడకం కూడా పెరిగి పోయింది.పగడం ముఖ్యం. వజ్రం, ద్వారా వచ్చే సౌభాగ్య వృద్ధి గూర్చి తెలిపే వారు కరువయ్యారు. కానీ వజ్రాలు, పగడాల వల్ల కల్గే లాభాలు తెల్సిన వారు మాత్రం వాటిని ఇప్పటికీ వాడుతున్నారు. చేతి ఉంగరంలోనో, మెడ లోని తాడు లోనే వేసుకుంటూన్నారు..అష్ట భోగాలను పొందుతున్నారు..మీరు కూడా జ్యోతిష్య పండితులను అడిగి మీకు తగిన వాటిని వాడండి..మంచి ఫలితాలను పొందండి.

Read more RELATED
Recommended to you

Latest news