ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంశం పై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ స్పందన

-

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంశంపై రేపు ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాల్సి ఉంది. ఈ మేరకు ఈరోజు ఉదయం కవితకు ఈడీ నోటీసులు జారీ చేసింది. తాను రేపు విచారణకు హాజరు కాలేనని, 15వ తేదీ హాజరవుతానని కవిత ఈడీకి సమాచారం పంపినప్పటికీ అధికారులు ఆమె విన్నపం పట్ల ఎలాంటి స్పందన ఇవ్వలేదు . దీంతో, ఢిల్లీకి వెళ్లారు కవిత . ఎల్లుండి ఆమె మహిళా రిజర్వేషన్లను డిమాండ్ చేస్తూ జంతర్ మంతర్ వద్ద ధర్నాకు చేయబోతున్నారు.

ED may arrest Kavitah says JD Lakshminarayana

ఈ నేపథ్యంలో ఆమె ఈడీ ముందు హాజరవుతారా, లేదా అనే విషయంలో సందేహం నెలకొంది. ఈ నేపథ్యంలో ఈ విషయంపై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ స్పందిస్తూ… మనీలాండరింగ్ ప్రొవిజన్స్ (పీఎంఎల్ఏ) కింద కవితకు ఈడీ నోటీసులు జారీ చేయడం జరిగిందని…ఒకవేళ విచారణకు కవిత సహకరించకపోతే ఆమెను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలిపారు . అయితే, ముందస్తు బెయిల్ కోరుతూ ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించే వెసులుబాటు ఉందని అన్నారు మాజీ జేడీ లక్ష్మీనారాయణ.

 

 

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news