ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంశంపై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందన

-

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ నోటీసులు ఇవ్వడంతో తెలంగాణ రాజకీయాలు హడావిడిగా మారాయి. ఈ అంశంపై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీడియాతో స్పందించారు… దీనిపై స్పందించాల్సింది తాను కాదని, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. కవితకు ఈడీ నోటీసులు ఇచ్చిన తర్వాత ఇంతవరకు రేవంత్ ఎందుకు స్పందించలేదని ఆయన మండిపడ్డారు.

Death threat: Case registered against Komatireddy Venkat Reddy in Nalgonda

ఇది ఇలా ఉంటే, రేపు ఢిల్లీలోని తమ కార్యాలయంలో తమ ముందు విచారణకు హాజరు కావాలని కవితకు ఇచ్చిన నోటీసుల్లో ఈడీ తెలిపింది. కవిత ఇప్పటికే ఢిల్లీకి పయనమయ్యారు. అయితే, రేపు ఆమె ఈడీ విచారణకు హాజరవుతారా? లేదా? అనే విషయంలో మాత్రం స్పష్టత లేదు. ఇప్పటికే కవిత సన్నిహితుడు రామచంద్రన్ పిళ్లైని ఈడీ అరెస్ట్ చేయడం జరిగింది. కవితకు పిళ్లై బినామీ అని ఈడీ స్పష్ట పరిచింది. ఈ నేపథ్యంలో ఏం జరగబోతోందనే ఉత్కంఠ సర్వత్ర నెలకొంది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news