ఇటీవల ఆళ్లగడ్డలో నారా లోకేష్ పాదయాత్రలో భాగంగా సొంత పార్టీ నేతల మధ్యన చోటు చేసుకున్న గొడవ వలన మాజీ మంత్రి మరియు టీడీపీ మహిళానేత భూమా అఖిలప్రియపై ఏవీ సుబ్బారెడ్డి సాక్ష్యాధారాలతో కేసు పెట్టడంతో ఆమెను పోలీసులు హత్యానేరం కింద FIR ఫైల్ చేసి అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. అయితే ఇప్పుడు ఈమెకు ఆరోగ్యం బాగాలేదన్న కారణాన్ని చూపుతూ బెయిల్ ఇవ్వాలని అఖిలప్రియ తరపు లాయర్లు కర్నూలు కోర్ట్ లో పిటిషన్ వేశారు. ఈ పిటీషన్ పై ఈ రోజు కర్నూల్ కోర్ట్ లో వాదనలు జరిగాయి. ఇప్పటికి లాయర్ల వాదనలు ముగిసినట్లు తెలుస్తోంది, అయితే అఖిలప్రియ లాయర్ల వాదనలు విన్న కర్నూల్ కోర్ట్ తీర్పును రేపటికి వాయిదా వేసింది.
మరి ఈమెకు కోర్ట్ బెయిల్ మంజూరు చేస్తుందా ? ఒకవేళ మంజూరు చేస్తే ఏవి సుబ్బారెడ్డి తరపున లాయర్లు రద్దు చేయమని పిటిషన్ వేస్తారా అన్న విషయాలు తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.