మన రాష్ట్రానికి ఇంకా రెండు కంపెనీలు వస్తున్నాయి. మంత్రి కేటీఆర్ తో గ్రిడ్ డైనమిక్స్ హోల్డింగ్స్, ఆరమ్ ఈక్విటీ పార్టనర్స్ ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. గ్రిడ్ డైనమిక్స్ హోల్డింగ్స్ కంపెనీ ఎంటర్‌ప్రైజ్-లెవల్ డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ సర్వీసెస్ మరియు సొల్యూషన్స్‌లో అగ్రగామిగా ఉంది. హైదరాబాద్ లో ప్రస్తుతం ఉన్న డెలివరీ కేంద్రాన్ని విస్తరించేందుకు ముందుకు వచ్చింది ఈ సంస్థ. గ్రిడ్ డైనమిక్స్ బోర్డు ఛైర్మన్ లాయిడ్ కార్నీ ప్రసంగిస్తూ విభిన్న ఇంజనీరింగ్ సామర్థ్యాలలో కొత్త ఉపాధి, ఇంటర్న్‌షిప్ అవకాశాలను సృష్టించేందుకు కంపెనీ కృషి చేస్తుందని వెల్లడించారు. ఈ సమావేశంలో గ్రిడ్ డైనమిక్స్ బోర్డు డైరెక్టర్ ఎరిక్ బెన్‌హమౌ, తెలంగాణ ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, రాజీవ్ శర్మ తదితరులు పాల్గొన్నారు.
ఆరమ్ వ్యవస్థాపకుడు వెంకట్ బుస్సా మాట్లాడుతూ ఏఐ, ఐఓటీ, మెషిన్ లెర్నింగ్, బిగ్ డేటా, బ్లాక్‌చెయిన్ , క్లౌడ్ కంప్యూటింగ్ వంటి సాంకేతికతలు మెయిన్ స్ట్రీమ్‌లోకి వెళుతున్నందున, డేటా సెంటర్ డెవలపర్‌లు ఎడ్జ్ కంప్యూటింగ్‌పై దృష్టి సారించి తమ ఆఫర్‌లను పునర్నిస్తున్నట్లు తెలిపారు. వినియోగదారులకు సమర్థవంతమైన, సురక్షితమైన డేటా ప్రాసెసింగ్ సౌకర్యం కల్పిస్తామని వెల్లడించాహ్రూ ఆయన. ఈ సమావేశానికి భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ టీవీ నాగేంద్ర ప్రసాద్, ఎస్‌ఎఫ్‌ఓ, తెలంగాణ ప్రభుత్వ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెక్రటరీ జయేష్ రంజన్, ప్రత్యేక కార్యదర్శి విష్ణురెడ్డి, టీ-హబ్ సీఈవో శ్రీనివాసరావు మహంకాళి హాజరయ్యారు.