బ్రేకింగ్‌: దేవినేని ఉమ అరెస్ట్‌.. ఏం జ‌రిగిందంటే..?

-

మాజీ మంత్రి దేవినేని ఉమను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఆయనను విజయవాడలోని భవానీపురం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వివ‌రాల్లోకి వెళ్తే.. రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండవచ్చని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ చేసిన సంచలన ప్రకటనపై విజయవాడ గొల్లపూడి సెంటర్‌లో జాతీయ రహదారిపై రైతులు ఆందోళనకు దిగారు. ఏపీలో రాజధానిని మార్చవద్దంటూ డిమాండ్ చేస్తున్నారు. వారికి మద్దతుగా గొల్లపూడి సెంటర్‌లో జాతీయ రహదారిపై మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు బైఠాయించారు.

దీంతో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. హైదరాబాద్-విజయవాడ రహదారికి ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. మాపై ఎందుకు ఈ పగ? అంటూ రైతులు ప్లకార్డులు ప్రదర్శించారు. జగన్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతులను పోలీసులు చెదరగొట్టారు. దేవినేని ఉమను అదుపులోకి తీసుకున్న పోలీసులు అక్కడి నుంచి తరలించారు.

Read more RELATED
Recommended to you

Latest news