పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా సరే జగన్ కి అండగా నిలబడ్డారు వాళ్ళు, రాజకీయంగా జగన్ కస్టాలు పడుతున్నప్పుడు, తనను కేంద్ర ప్రభుత్వం ఇబ్బంది పెడుతున్నప్పుడు జగన్ వెంటే నడిచారు… ఆర్ధికంగా ఇబ్బందులు ఉన్నప్పుడు తమ వంతు సహకారం అందించారు… రాజకీయ విమర్శలను సమర్ధవంతంగా తిప్పి కొట్టారు. జగన్ కోసం అన్నీ మేమే అన్నారు… ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది… వాళ్లకు కేబినేట్ లో చోటు దక్కలేదు… అయినా సరే తమకు ఉన్న పదవులతో ప్రభుత్వంలో కీలకంగా మారారు.
వాళ్ళే చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి, రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణా రెడ్డి… వైఎస్ కి వీర భక్తులు వీళ్ళు… ఆ ప్రేమతోనే జగన్ వెంట నడిచారు… ఇప్పుడు ప్రభుత్వంలో చక్రం తిప్పుతున్నారు.. గుంటూరు కృష్ణా జిల్లా బాధ్యతలు మొత్తం ఆర్కే చూస్తున్నారు. రాజధాని ప్రాంత ఎమ్మెల్యే కావడంతో ఆయనకు జగన్ కూడా కాస్త ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. దీనితో మంత్రులను కూడా ఆయన శాసిస్తున్నారు అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినపడుతున్నాయి… అందరితో సన్నిహితంగా ఉంటూ,
తన వంతు సహకారం అందిస్తున్నారు. ఇక చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి విషయానికి వస్తే… జగన్ కి ముందు నుంచి అండగా నిలబడిన నేత ఆయన… ఇప్పుడు చిత్తూరు జిల్లాలో చక్రం తిప్పుతున్నారు. ప్రభుత్వ విప్ గా ఉంటూ… పాలనలో కీలక సలహాలు ఇస్తున్నారు ఆయన… జగన్ కి అండగా ఉంటున్నారు. గడికోట శ్రీకాంత్ రెడ్డి విషయానికి వస్తే… జగన్ చిన్ననాటి స్నేహితుడిగా ఉన్న శ్రీకాంత్ రెడ్డి… కడప జిల్లాలో కీలక నేతగా ఉన్నారు… జిల్లా వ్యవహారాలను ఆయనే చూస్తూ జగన్ కి అండగా నిలబడుతున్నారు… అధికారులతో పరుగులు పెట్టిస్తున్నారు. ఇలా ఈ ముగ్గురు నేతలు కూడా ప్రభుత్వంలో మంత్రుల కన్నా శక్తివంతులుగా పేరు తెచ్చుకున్నారు.