హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్..RRR చుట్టూ ఎంఎంటీఎస్ సేవల విస్తరణ !

-

హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్. త్వరలోనే ట్రిపుల్ ఆర్ చుట్టూ ఎంఎంటీఎస్ సేవల విస్తరణ జరుగనుంది. రీజనల్ రింగు రోడ్డు చుట్టూ ఎంఎంటీఎస్ సేవలను విస్తరించాలని బీజేపీ నేతలు చేసిన విజ్ఝప్తిపట్ల సానుకూలంగా స్పందించారు రైల్వేశాఖ మంత్రి అశ్వీనీ వైష్ణవ్. ఈ మేరకు ప్రతిపాదనలను సిద్ధం చేస్తే రైల్వే శాఖ అధికారులతో చర్చించి తెలంగాణ ప్రజలకు ఆమోదయోగ్యం కలిగేలా నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు రైల్వేశాఖ మంత్రి అశ్వీనీ వైష్ణవ్.

రాష్ట్రంలో పార్టీ చేపడుతున్న కార్యక్రమాలను అడిగి తెలుసుకున్న రైల్వే మంత్రి అశ్వీనీ వైష్ణవ్… రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న రైల్వే ప్రాజెక్టులు, రైల్వే లైన్ల ఏర్పాటు విషయంలో రాష్ట్రానికి ప్రయోజనం కలిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సమయంలో స్వామిగౌడ్ రీజనల్ రింగు రోడ్డుకు ఎంఎంటీఎస్ సేవలను విస్తరిస్తే తెలంగాణ ప్రజలకు ఎంతో ప్రయోజకరంగా ఉంటుందని కోరారు.

వెంటనే సానుకూలంగా స్పందించిన రైల్వే మంత్రి ట్రిపుల్ ఆర్ విస్తీర్ణం, ప్రాజెక్టు పురోగతి ఏమిటని అడిగారు. అక్కడే ఉన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందిస్తూ ‘‘తెలంగాణలో 10 జిల్లాలను కలుపుతూ 300 కిలోమీటర్ల మేరకు రీజనల్ రింగు రోడ్డును ఏర్పాటు చేయబోతున్నాం. ప్రాజెక్టు వ్యయం సమారు రూ.20 వేల కోట్లు. భూ సేకరణకయ్యే వ్యయంలో కేంద్ర రాష్ట్రాలు 50:50 శాతం వాటా భరిస్తున్నాయి. ఈ ప్రక్రియ వేగంగా జరుగుతోంది’’అని బదులిచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news