భ‌ర్త స్నేహితుడి పై మోజు..భ‌ర్త‌కు ఉరివేసి కడతేర్చింది.. చివరకు

-

క్షణకాల సుఖం కోసం పచ్చని సంసారాలను పాడుచేసుకుంటున్నారు. పెళ్లి అయిన తర్వాత కూడా ప్రియుడి మోజులో పడి తమ జీవితాలను పాడు చేసుకుంటున్నారు. భర్తలకు తెలిస్తే.. వారిని కర్కషంగా కడతేరుస్తున్నారు. తాజాగా ఇలాంటి సంఘటనలోనే ప్రియుడితో పాటు సదరు మహిళకు మేడ్చల్ కోర్ట్ జీవిత ఖైదును విధిస్తూ… తీర్పునిచ్చింది.

వివరాల్లోకి వెళితే..మేడ్చల్‌ మండలంలోని అక్బర్జాపేట్‌ గ్రామానికి చెందిన మహంకాళి లక్ష్మి, మహంకాళి కృష్ణ దంపతులు. అదే గ్రామానికి చెందిన గుంటి బాలరాజ్‌ 2014లో మహంకాళి కృష్ణ ఆటో కొనుగోలు చేయడం అప్పటి నుంచి వీరి మధ్య స్నేహం ఏర్పడింది. ఈ స్నేహాన్ని అడ్డు పెట్టుకుని బాలరాజ్ తరుచుగా లక్ష్మీ ఇంటికి వెళ్లేవాడు. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది.

రాత్రి ఇంటికి పిలుపించుకున్న సమయంలో..

అయితే ఒకానొక సమయంలో వీరిద్దరి బండారం కృష్ణకు తెలిసింది. తీరు మార్చుకోవాల్సిందిగా ఎన్నిసార్లు హెచ్చరించినా.. భార్య లక్ష్మీ వినలేదు. ప్రియుడు బాలరాజ్ తో సంబంధాన్ని నెరిపింది. అయితే విషయం తెలియడంతో చాలా సార్లు కృష్ణను చంపేందుకు ప్రయత్నించారు. మద్యంలో నిద్రమాత్రలు కలిపి.. చాలా సార్లు చంపాలని చూసినా కృష్ణకు ఏం కాలేదు.

కాగా ఓ రోజు కృష్ణ పడుకున్న సమయంలో రాత్రి తన ప్రియుడు బాలరాజ్ ను ఇంటికి పిలుపించుకుని అక్రమ సంబంధం నెరుపుతున్న సమయంలో మెలుకువ వచ్చిన కృష్ణ వీరిద్దరిని రెడ్ హ్యాండెట్ గా పట్టుకున్నాడు. అయితే అప్పటికే చంపాలని పథకం వేసుకున్న భార్య లక్ష్మీ, ఆమె ప్రియుడు బాలరాజ్ లు ఇద్దరు కలిసి కృష్ణ మెడకు తాడు బిగించి అత్యంత దారుణంగా హత్య చేశారు. 2020 ఏప్రిల్‌ 8న ఈ ఘటన జరిగింది. అయితే కల్లు దొరక్కపోవడంతో మనస్తాపం చెంది మరణించాడని కట్టుకథ అల్లి అందరిని నమ్మించింది.

సోదరుడి అనుమానంతో వెలుగులోకి..

మృతుడు కృష్ణ సోదరుడు మహంకాళి సురేష్ తన అన్న ఒంటిపై ఉన్న గాయాలను చూసి అనుమానం వ్యక్తం చేశాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసును దర్యాప్తు చేసిన పోలీసులు మహంకాళి లక్ష్మీ, బాలరాజ్ లే హత్య చేశారని నిర్థారించి రిమాండ్ కు తరలించారు. కాగా ఈ కేసు సోమవారం 11 ఏడీజే కోర్ట్ లో విచారణకు రాగా.. న్యాయమూర్తి జయంత్రి .. నిందితులు ఇద్దరికి జీవిత కాలం కఠిన కారాగార శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ.3వేల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news