ఫేస్బుక్ కాంగ్రెస్ కి సమాధానం ఇచ్చింది. కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలపై స్పందించింది. ఫేస్బుక్ ‘పక్షపాతరహితమైనదని స్పష్టం చేసింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన అన్ని ఖాతాలపై ప్రజలు స్వేచ్ఛగా భావాలను వ్యక్తీకరించే ప్రదేశంగా ఉండేలా కృషి చేస్తాయని ఫేస్బుక్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ లేఖకు రాసిన సమాధానంలో స్పష్టం చేసింది.
“మేము పక్షపాత రహితంగా ఉన్నాము మరియు ప్రజలు స్వేచ్ఛగా తమ భావాలను వ్యక్తీకరించే ప్రదేశంగా మా ప్లాట్ ఫారమ్ లు ఉండేలా చూడటానికి ప్రయత్నిస్తామని పేర్కొంది. మేము పక్షపాత ఆరోపణలను తీవ్రంగా పరిగణిస్తామని పేర్కొంది. అన్ని విధాలుగా ద్వేషాన్ని, మూర్ఖత్వాన్ని ఖండిస్తున్నాము ”అని ఫేస్‌బుక్ ట్రస్ట్ అండ్ సేఫ్టీ డైరెక్టర్ నీల్ పాట్స్ లేఖలో తెలిపారు. మా కమ్యూనిటీ ప్రమాణాలు మతం, కులం, జాతి మరియు జాతీయ మూలాలతో సహా వారి రక్షణ లక్షణాల ఆధారంగా ప్రజలపై దాడులను నిషేధించాయి” అని స్పష్టం చేసింది.