చైనాకు షాక్ ఇచ్చిన ఫేస్బుక్…!

-

ఆసియా మరియు అమెరికన్ రాజకీయాల్లో జోక్యం చేసుకుంటున్న చైనా ఫేస్బుక్ ఖాతాలను తొలగించినట్లుగా ఫేస్‌బుక్ మంగళవారం తెలిపింది. వీటిలో కొన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మద్దతుగా అలాగే వ్యతిరేకిస్తున్న పోస్ట్ లు చేస్తున్నాయి. ఆరు ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలతో పాటు ఫేస్బుక్ ప్లాట్‌ ఫాంపై 155 ఖాతాలను నిలిపివేసినట్లు ఫేస్బుక్ యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది.

ఫిలిప్పీన్స్ లో ఎక్కువగా వీటిని వాడుతున్నారు అని గుర్తించారు. యుఎస్ ఖాతాల్లో తక్కువ మంది ఫాలోవార్లు ఉన్నారు. ఫేస్‌బుక్ సైబర్‌ సెక్యూరిటీ పాలసీ చీఫ్ నాథనియల్ గ్లీచెర్ మాట్లాడుతూ, అమెరికా రాజకీయాల్లో ఏదైనా ప్రణాళికతో విదేశీ జోక్యం ఉంటే… కచ్చితంగా చర్యలు తీసుకుంటాం అని పేర్కొన్నారు. “కంటెంట్ పరిమాణం చాలా తక్కువగా ఉంది, వారి లక్ష్యం ఏమిటో అంచనా వేయడం చాలా కష్టం,” అని గ్లీచెర్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news