ఫ్యాక్ట్ చెక్; ముస్లిం తల్లీ కూతుర్ని కావాలని చంపారా…?

-

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత తప్పుడు ప్రచారానికి కొదవ లేదు అనే మాట అక్షరాలా నిజం. ఎవరికి తోచిన విధంగా వాళ్ళు సోషల్ మీడియాలో తప్పుడు వీడియో లను షేర్ చేస్తూ హడావుడి చేస్తున్నారు. ఇలాగే ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఉత్తర ప్రదేశ్ బల్లియాలో ఒక ముస్లిం మహిళ మరియు ఆమె కుమార్తె రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళుతుండగా ఆల్టో కారో ఉద్దేశపూర్వకంగా వెనుక నుండి ఢి కొట్టి చంపారు అనే ప్రచారం జరిగింది.

భారతదేశంలో పెరుగుతున్న ఇస్లామోఫోబియాకు ఇది ఒక ఉదాహరణ అని పలువురు కామెంట్ చేసారు. దీనిపై జాతీయ మీడియా ఆరా తీయడం మొదలుపెట్టింది. వారు అసలు ముస్లిం లు కాదని తల్లి పేరు ఉషా దేవి, కుమార్తె పుష్పాంజలి గా గుర్తించారు. ఫేస్బుక్ యూజర్ “అబిద్ అలీ” ఈ వీడియోను షేర్ చేసి, ఇస్లామోఫోబియాఇన్ఇండియా ఈ సంఘటన యుపి బల్లియాలోని రాస్రాలో జరిగిందని చెప్పాడు.

బహిరంగంగా హత్య చేయడానికి వారు చేసిన తప్పు ఏంటీ… ఈ దేశ౦లో ద్వేషం ఎక్కువగా ఉంది. ముస్లిం లు కరోనా తో పాటుగా అలాంటి మనస్తత్వం ఉన్న వారితో పోరాడుతుందని వ్యాఖ్యానించారు. దీనిని న్యూస్ 18 అనే జాతీయ ఛానల్ యుపి ఉత్తరాఖండ్ విభాగ౦ యుట్యూబ్ లో పోస్ట్ చేసింది. ఈ సంఘటన యుపి బల్లియా జిల్లాలోని రాస్రా పట్టణంలో జరిగిందని పేర్కొన్నారు. ఒక కారు ప్రమాదంలో వాళ్ళు మరణించారని పేర్కొన్నారు.
.
ఇది నిజమా కాదా అని తెలుసుకోవడానికి గానూ బల్లియా పోలీసులను సంప్రదించగా… బాధితులు ముస్లింలు కాదని, ఈ సంఘటనలో మతపరమైన కోణం లేదని రాస్రా ఎస్‌హెచ్‌ఓ సౌరభ్ కుమార్ రాయ్ స్పష్టం చేశారు. బాధితులను ఉషా దేవి, ఆమె కుమార్తె పుష్పాంజలిగా గుర్తించినట్లు ఆయన ధృవీకరించారు. పోలీసులు కారును గుర్తించారని, నిందితులను త్వరలో అరెస్టు చేస్తామని ఎస్‌హెచ్‌ఓ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news