Fact check: స్టేట్ బ్యాంక్ రూ.6 వేల బహుమతిని ఇస్తోందా..? నిజం ఏమిటి..?

-

తరచు మనకి సోషల్ మీడియాలో నకిలీ వార్తలు కనబడుతుంటాయి. ఒక్కొక్కసారి ఏదైనా వార్త వస్తే ఇది నిజమా కాదా అని ఆలోచిస్తూ ఉంటాము. నకిలీ వార్తల్ని కూడా నమ్మి మోసపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎప్పుడైనా సరే ఫేక్ వార్తలకు దూరంగా ఉండాలి లేదంటే అనవసరంగా నష్ట పోవాల్సి వస్తుంది. తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త వచ్చింది.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ని ఏర్పాటు చేసి 60 ఏళ్ళు పూర్తయిందని ఈ సందర్భంగా కస్టమర్లు ఆరువేల రూపాయలు గెలుపొందే అవకాశం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కల్పిస్తోందని సోషల్ మీడియాలో ఒక మెసేజ్ వైరల్ గా మారింది. అయితే ఇందులో నిజం ఎంత అనేది ఇప్పుడు చూద్దాం.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ మెసేజ్ పై స్పందించి ప్రజలను అలర్ట్ చేసింది ఇటువంటి మోసాలు నుంచి దూరంగా ఉండాలని ఇది నిజం కాదని హెచ్చరించింది. సబ్సిడీ, ఫ్రీ ఆఫర్, ఫ్రీ గిఫ్ట్ ఇలాంటి మెసేజ్లు కనుక వస్తే వాటిపై స్పందించి జాగ్రత్తగా ఉండాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పింది. ఇలాంటి ఆఫర్స్ అంటూ సైబర్ నేరగాళ్లు మోసం చేస్తున్నారని తెలిపింది కనుక ఫేక్ మెసేజ్ల తో జాగ్రత్తగా ఉండాలి. అనవసరంగా నమ్మి మోసపోకండి.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వార్షికోత్సవం సందర్భంగా ఆరు వేల రూపాయలను ఇవ్వడంలేదు అదే విధంగా పాన్ కార్డు వివరాలను అప్డేట్ చేసుకోవాలి అని వస్తున్న వార్తలు కూడా ఫేక్ అది కూడా నిజం కాదు.

Read more RELATED
Recommended to you

Latest news