“నిర్లక్ష్యం చేయకండి. చాలా జాగ్రత్తగా చదవండి. నేను వరుణ్ పుల్యాని. వాట్సాప్ డైరెక్టర్‌ని. ఫేస్‌బుక్ ఓనర్ మార్క్ జుకర్‌బర్గ్‌కు 19 బిలియన్ డాలర్లకు వాట్సాప్‌ను అమ్మాం. ప్రస్తుతం వాట్సాప్‌ను మార్క్ జుకర్‌బర్గ్ కంట్రోల్ చేస్తున్నారు. మీకు 20 కాంటాక్ట్‌లు ఉన్నట్లయితే ఈ మెసేజ్‌ను వారికి వాట్సాప్‌లో పంపించండి. మీ వాట్సాప్ యాప్ లోగో ఎఫ్ అనే అక్షరంతో 24 గంటల్లో మారుతుంది. ఈ మెసేజ్‌ను 10 మందికి పంపించండి. లేదంటే మా కొత్త సర్వర్ల నుంచి మీ వాట్సాప్ అకౌంట్‌ను డిలీట్ చేస్తాం.”
“ఇదే చివరి హెచ్చరిక. 2017 నుంచి వాట్సాప్ ను వాడాలంటే ఖర్చు అవుతోంది. ఈ మెసేజ్‌ను మీ కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్న 20 మందికి పంపించండి. దీంతో మీ వాట్సాప్ ఐకాన్ బ్లూ కలర్‌లోకి మారుతుంది. అంటే మీకు వాట్సాప్ ఉచితమని అర్థం. మీరు ఈ మెసేజ్‌ను రేపు సాయంత్రం 6 గంటలలోగా పంపించకపోతే మీరు వాట్సాప్‌ను వాడేందుకు డబ్బులు చెల్లించాలి. మా కొత్త సర్వర్లు బాగా లోడ్ అయిపోయాయి. అందుకనే సహాయం అడుగుతున్నాం. ఈ మెసేజ్‌ను యూజర్లు తమ కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్న అందరికీ వాట్సాప్ ద్వారా పంపించాలి. లేదంటే వాట్సాప్ మీ నుంచి డబ్బులను వసూలు చేస్తుంది. అలాగే మీ అకౌంట్ డీయాక్టివేట్ అవుతుంది.”
“వాట్సాప్ సీఈవో జిమ్ బాల్సామిక్ నుంచి వచ్చిన మెసేజ్ ఇది. మాకు వాట్సాప్‌లో చాలా మంది యూజర్లు ఉన్నారు. అందరికీ ఈ మెసేజ్‌ను ఇతరులకు ఫార్వార్డ్ చేయమని కోరుతున్నాం. లేదంటే మీ అకౌంట్ ఇన్‌వాలిడ్ అవుతుంది. అలాగే 48 గంటల్లోగా మీ వాట్సాప్ అకౌంట్ డిలీట్ అవుతుంది. ఈ మెసేజ్‌ను నిర్లక్ష్యం చేయకండి. వాట్సాప్ మీ నుంచి నెలకు రూ.25 వసూలు చేస్తుంది.”
ఏంటివన్నీ.. అనుకుంటున్నారా ? ఏమీ లేదండీ.. ఇవన్నీ వాట్సాప్‌లో ఎప్పటికప్పుడు మనకు ఫార్వార్డ్ అవుతున్న ఫేక్ మెసేజ్‌లు. చాలా మంది యూజర్లు వీటిని నిజమే అని నమ్మి మోసపోతున్నారు. అందుకనే వాట్సాప్ యూజర్లకు అప్రమత్తం చేసేందుకే ఈ మెసేజ్‌లను పైన ఇవ్వడం జరుగుతుంది. వాటిని గమనించి అవగాహన పెంచుకోండి. ఇకపై వాట్సాప్ లో వచ్చే ఇలాంటి ఫేక్ వార్తలకు స్పందించకండి. ఇవన్నీ నకిలీ మెసేజ్‌లని పరిశీలనలో వెల్లడైంది. కాబట్టి వీటి పట్ల జాగ్రత్తగా ఉండండి.