రెండు కులాల మధ్య చిచ్చు..టీఆర్ఎస్ కి తలనొప్పిగా మారిందా

-

ఆ మంత్రి దూకుడు అసలుకే మోసం తెచ్చింది. చివరకు క్షమాపణ చెప్పేందుకు సిద్ధమన్నా సోషల్ మీడియా స్పీడుతో జరగాల్సిన నష్టం జరిగిపోయింది. రెండు కులాల మధ్య చిచ్చు పెట్టిన ఆయన మాటల తీరు చివరకు పార్టీకే ఇబ్బందిగా మారింది. ముదిరాజ్‌, గంగపుత్రుల వివాదంలో తలసాని నుంచి వచ్చిన కామెంట్స్‌ మంత్రితో పాటు పార్టీకి పెద్ద తలనొప్పిగా మారిందా అన్న చర్చ టీఆర్ఎస్ వర్గాల్లో నడుస్తుంది.

మంత్రి తలసాని ఏం మాట్లాడినా కొట్టినట్టే ఉంటుంది. పర్యవసనాలను అస్సలు పట్టించుకోరు. కొన్నిసార్లు చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు వ్యవహారం ఉంటుందట. తాజా ఎపిసోడ్‌లోనూ అదే జరిగిందనే కామెంట్స్‌ జోరందుకున్నాయి. ఇటీవల కోకాపేట్‌లోని ముదిరాజ్‌ భవన్‌ శంకుస్థాపన కార్యక్రమానికి తలసాని హాజరయ్యారు. ఆ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ముదిరాజ్‌ సామాజికవర్గాన్ని ఆకర్షించాలని ప్రయత్నించారో ఏమో పెద్ద తేనెతుట్టనే కదిపారు.

చెరువులలో పెరిగిన చేపలపై పూర్తి హక్కులు ముదిరాజ్‌లకు ప్రభుత్వం ఇచ్చింది..ఏమైనా ఇబ్బందులొస్తే స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని మంత్రి సలహా ఇచ్చారు. అంతేకాదు.. వారిపై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కామెంట్స్‌పై సోషల్‌ మీడియాలో అనుకూలంగా ప్రతికూలంగా పోస్టులు వెల్లువెత్తాయి. ఇప్పటి వరకు ఈ అంశంపై అవగాహన లేనివారు సైతం అసలు తలసాని ఏం అన్నారు ఎందుకింత రియాక్షన్‌ వస్తోంది అని ఆరా తీస్తున్నారట.

తలసాని ఈ వ్యాఖ్యలు ఇలా చేశారో లేదో గంగపుత్ర సామాజికవర్గానికి చెందినవారు భగ్గుమన్నారు. తమ హక్కులను హరించే విధంగా మంత్రి కామెంట్స్‌ చేశారని ఆరోపిస్తూ.. ఏకంగా ఆయన్ని కేబినెట్‌ నుంచి బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రస్తుతం ఇదే అంశంపై తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఆందోళనలు చేస్తున్నారు గంగపుత్రులు. మంత్రి క్షమాపణ చెప్పాలని రోడ్డెక్కారు. హైదరాబాద్‌ దిగ్భందనానికి పిలుపిచ్చారు. అంతేకాదు..మంత్రి వ్యాఖ్యలు కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నమని పలు సంఘాలు రాగం అందుకున్నాయి.

ఈ సెగ అటు పార్టీకి.. ఇటు మంత్రి తలసానికి కూడా తాకాయట. ఈ స్థాయిలో రియాక్షన్‌ ఉంటుందని మంత్రి కూడా ఊహించలేదట. దాంతో ముదిరాజ్‌ భవన్‌ శంకుస్థాపన సందర్భంగా చేసిన కామెంట్స్‌పై ఆయన వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. గంగపుత్రులను బాధపెట్టేలా తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని తెలిపారు తలసాని. ఒకవేళ తన కామెంట్స్‌ తప్పుగా ఉన్నాయని భావిస్తే.. క్షమాపణ చెప్పేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. మంత్రి చక్కదిద్దే ప్రయత్నం చేసినా
అటు పార్టీకి ఇటు ఆయనకు గట్టీ షాకే ఇచ్చాయి.

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news