సమంతతో శృంగార సన్నివేశాలు తొలగించారు: షాహబ్ అలీ

-

అక్కినేని వారి కోడలు సమంత ‘ఫ్యామిలీ మ్యాన్ సీజన్-2’వెబ్ సిరిస్‌లో నటించారు. ఆమె ఈ సిరీస్‌లో రాజీ అనే పాత్రలో కనిపించారు. రాజీ పాత్రలో సమంత నటనకు అందరూ ఫిదా అయ్యారు. అయితే ఈ సిరీస్‌లో సమంత తనతో కొన్ని శృంగార సన్నివేశాల్లో నటించారని సహ నటుడు షాహబ్ అలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తామిద్దరి ప్రేమను చూపేలా మేకర్స్ కొన్ని శృంగార సన్నివేశాలు చిత్రీకరించారని తెలిపారు. కానీ వాటిని ఎడిటింగ్‌లో తొలగించారని షాహబ్ అలీ పేర్కొన్నారు. సినిమాలు, సిరీస్‌ల్లో శృంగార సన్నివేశాలు పెద్ద మేటర్ కాదని ఆయన వెల్లడించారు. తప్పని సరి అయితే ఆ సీన్స్‌ను చూపిస్తారని చెప్పారు. వద్దనుకుంటే ఎడిట్ చేసేస్తారని అలీ స్పష్టం చేశారు. అలా తమ బెడ్ రూమ్ సీన్స్‌ను తొలగించారని ఆయన హాట్ కామెంట్స్ చేశారు.

కాగా ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స‌మంత‌తో వ‌ర్కింగ్ ఎక్స్ పీరియ‌న్స్ గురించి షాహ‌బ్ అలీ మాట్లాడారు. డైరెక్ట‌ర్స్ రాజ్ డీకే తనను సంప్ర‌దించిన‌పుడు ఈ సిరీస్‌లో స‌మంత ఉంద‌ని తెలిసి చాలా ఎక్సయిట్ అయ్యానని చెప్పారు. తాను ఒక పెద్ద స్టార్ అని, స్ఫూర్తి అని కూడా చెప్పారు. సూప‌ర్ డీల‌క్స్‌తో పాటు స‌మంత న‌టించిన కొన్ని సినిమాలు చూశానన్నారు. ‘‘మొద‌ట భ‌య‌ప‌డ్డా. కానీ షూటింగ్ మొద‌ల‌య్యాక నాలో ఉన్న భ‌యం పోయి సౌక‌ర్యంగా ఫీల‌య్యేలా చేశారు స‌మంత‌. ఆమె చాలా డెడికేష‌న్ క‌లిగిన న‌టి. స‌మంత నుంచి చాలా నేర్చుకున్నా’’ అని అన్నారు.

 

ఇక సమంత విగ్నేష్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో నయనతార, విజయ్ సేతుపతి కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మరోవైపు గుణశేఖర్ తెరకెక్కిస్తున్న ‘శాకుంతలం’ అనే సినిమాలో కూడా ఆమె కీలక పాత్రలో నటిస్తున్నారు. ఓ బేబీ దర్శకురాలు నందిని రెడ్డితో ఆమె ఒక హారర్ చిత్రం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news