వివాదంలో చిక్కుకున్న ప్రముఖ నటి.. నెటిజన్స్ ట్రోల్స్..!

-

సాధారణంగా సినిమా వాళ్లు ఎప్పటికప్పుడు వివాదాల్లోకి రావడం జరుగుతూ ఉంటుంది.. ముఖ్యంగా వారు తెలిసి తెలియక చేసే చిన్న చిన్న పనులను కూడా ప్రజలు , మీడియా భూతద్దంలో పెట్టి మరీ చూస్తూ వైరల్ చేస్తూ ఉంటాయి. ఈ క్రమంలోని ఏ చిన్న తప్పు చేసినా సరే వారిని టార్గెట్ చేస్తూ రకరకాలుగా ట్రోల్స్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోని తాజాగా ప్రముఖ బాలీవుడ్ నటి భూమిపడ్నేకర్ కూడా ఇప్పుడు మరొకసారి వివాదంలో చిక్కుకున్నారు. ఈసారి ఆమె తన చెప్పులు విడవడానికి అసిస్టెంట్ సహాయం తీసుకోవడంతో ఇది కాస్త రచ్చకు దారితీసింది.

తాజాగా భూమి పడ్నేకర్ ఒక కార్యక్రమానికి వెళ్లారు. అక్కడ కార్యక్రమం ప్రారంభోత్సవం సందర్భంగా జ్యోతి ప్రజ్వలన జరిగింది. దీపం కుందే ఉన్న స్టేజి మీదకు అతిధులంతా ఎక్కారు. వారిలో భూమి కూడా ఉన్నారు.. ఈ నేపథ్యంలోని దీపపుకుందే దగ్గరకు రావాలని కొంతమంది ఆమెకు చెప్పారు. దీంతో చెప్పులు విడవడానికి ప్రయత్నించింది.. అయితే వాటిని తీయడం ఆమె వల్ల కాలేదు.. దాంతో ఆమె స్టేజి మీద నుంచి కిందకు దిగింది. అప్పుడు ఆమె అసిస్టెంట్ ఆమెకు సహాయం చేశాడు.. తర్వాత ఆమె దీపపు కుందే దగ్గరకు వెళ్ళిపోయారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి.

దీంతో మండిపోయిన నెటిజన్లో ఆమెపై చాలా రకాలుగా ట్రోల్స్ చేస్తున్నారు.. భూమి చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారు అంటూ ఆమెపై నెగిటివ్గా చాలా కామెంట్లు చేస్తున్నారు.. అంతేకాదు భూమి తన పెళ్లి విషయంలో కూడా ట్రోలింగ్ ఎదుర్కొంది.. వేరే మతానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకోవడంతో కొంతమంది ఆమెను విమర్శించారు. ఇప్పుడు అసిస్టెంట్ తో చెప్పులు తీయించుకోవడంతో మరోసారి వివాదంలో చిక్కుకుంది ఈ ముద్దుగుమ్మ.

Read more RELATED
Recommended to you

Latest news