ఏపీలో రూ.20 వేల కోట్ల పెట్టుబడులు పెట్టాం : కరణ్ అదానీ

-

ఆదాని గ్రూపు ఏపీలో వివిధ రంగాల్లో ఇప్పటికే రూ.20వేల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టిందని ఆదాని స్పోర్ట్స్ CEO కరణ్ ఆదాని తెలిపారు. వీటి ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 70 వేల మందికి ఉపాధి లభిస్తోందన్నారు.

ఇన్వెస్టర్ సమ్మిట్ లో మాట్లాడుతూ, ‘గంగవరం, కృష్ణపట్నం పోర్టుల సామర్థ్యాన్ని 200 మి. ట. ల.కు పెంచనున్నాం. రెన్యువబుల్ ఎనర్జీలో 15వేల మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తికి ఒప్పందం చేసుకున్నాం’ అని పేర్కొన్నారు.

ఏపీలో కీలక రంగాల్లో వనరులు పుష్కలంగా ఉన్నాయని అటు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ తెలిపారు. ‘ఇన్వెస్టర్ సమ్మిట్ లో భాగమైనందుకు సంతోషంగా ఉంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ లో రాష్ట్రం ముందుంది. ఇక్కడ జియో నెట్వర్క్ బాగా వృద్ధి చెందింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ కు ప్రభుత్వం నుంచి మంచి సహకారం లభిస్తోంది. ఇక్కడ మా పెట్టుబడులు కొనసాగుతాయి. ముఖ్యంగా సౌర విద్యుత్ రంగంలో ఇన్వెస్ట్ చేస్తాం’ అని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news