ఈ రైతులకి 12వ విడత రూ. 2000 పడవు..!

కేంద్రం రైతుల కోసం ఎన్నో స్కీమ్స్ ని తీసుకు వచ్చింది. ఈ స్కీమ్స్ వలన ఎన్నో చక్కటి ప్రయోజనాలు రైతులు పొందుతున్నారు. రైతులకు మోడీ సర్కార్‌ ప్రవేశపెట్టిన స్కీమ్స్ లో కిసాన్‌ సమ్మాన్‌ నిధి యోజన స్కీమ్‌ కూడా ఒకటి. ఈ స్కీమ్ తో రైతులు చక్కటి లాభాలను పొందుతున్నారు.

farmers

రైతుల ఖాతాల్లోకి డబ్బులు ఈ స్కీమ్ కింద వస్తాయి. ఇప్పటి వరకు 11 వాయిదాలు రైతుల ఖాతాల్లోకి వచ్చాయి. ఇప్పుడు 12వ విడత డబ్బులు పడాల్సి వుంది. కేంద్ర ప్రభుత్వం రైతులకు ఆసరాగా ఉండాలనే సంవత్సరానికి 6 వేల రూపాయలను రైతుల ఖాతాల్లో వేస్తోంది.

అయితే కొందరికి వారి అకౌంట్లోకి డబ్బులు రావడం లేదు. దరఖాస్తు చేసుకునే అప్పుడు కొన్ని తప్పుల వలన ఈ డబ్బులు పడడం లేదు. అందుకే కొందరికి డబ్బులు పడడం లేదు. బ్యాంక్ వివరాల నుండి ఇతర వివరాల వరకు కొన్ని తప్పులు రైతులు చేస్తుంటే వాళ్ళకి ఆ డబ్బులు రావడం లేదు. పేర్లు తప్పుగా పడడం కానీ ఆధార్ కార్డులో వివరాలు సరిగా లేదంటే ఇబ్బందులు వస్తాయి. రైతులు ఫార్మ్ ని ఫిల్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. బ్యాంకుల విలీనం కారణంగా IFSC కోడ్‌లు మారిపోయాయి. అవి కూడా జాగ్రత్తగా చూసుకోవాలి.

రైతులు తప్పులని ఇలా మార్చుకోవచ్చు:

pmkisan.gov.in వెబ్‌సైట్‌కి వెళ్ళాలి.
ఫార్మర్స్ కార్నర్ ని సెలెక్ట్ చేసుకుని.. ఆధార్ సవరణ చూడాలి.
బ్యాంక్ ఖాతా నంబర్‌లో పొరపాటు ఉంటే దానిని సరి చేసుకోండి.