కేంద్రం రైతులకు శుభవార్త తెలిపింది. ఇక గంటల తరబడి బ్యాంకుల వద్ద నిరీక్షించకుండా, ఇంటి వద్ద నుంచే కిసాన్ క్రెడిట్ కార్డు ( Kisan Credit Card ) రివ్యూ సేవలు పొందవచ్చు. దీనికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతా ఉంటే సరిపోతుంది.

తమ ఖాతా కలిగిన రైతులు తమ కేసీసీ రివ్యూ కోసం బ్యాంక్ బ్రాంచుకు వెళ్లకుండానే దరఖాస్తు చేసుకోవచ్చని స్టేట్ బ్యాంక్ ట్విట్టర్ వేదికగా తెలియజేసింది. కేసీసీ అకౌంట్‌ను ఇంటి నుంచే సమీక్షించుకోవచ్చని బ్యాంక్ తెలిపింది. కానీ, ఈ సేవలు పొందడానికి రైతులు యోనో యాప్ ఉపయోగించాల్సి ఉంది. ఎస్బీఐ తమ కస్టమర్ల కోసం యోనో యాప్ నుంచి పలు రకాల సేవలను అందిస్తున్న విషయం తెలిసిందే. ఇకపై రైతులు వారి కిసాన్ క్రెడిట్ కార్డు అకౌంట్ వివరాలు తెలుసుకోవచ్చు.
యోనో యాప్‌లో క్రిషి అనే ఆప్షన్ ద్వారా రైతులు ఈ సేవలు పొందొచ్చు. ప్రధానంగా రైతులకు సులభంగానే రుణాలు అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్‌ను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. పీఎం కిసాన్ లో లబ్ధిదారులుగా ప్రతీ ఒక్కరు కేసీసీకి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక సులభంగా యోనో యాప్ ద్వారా తమ కిసాన్ క్రెడిట్ కార్డు సేవలను ఇంటి వద్ద నుంచే పొందవచ్చు.