బౌలింగ్ లో స్టెయిన్ రికార్డుని బద్దలు కొట్టిన ఢిల్లీ కేపిటల్స్ బౌలర్..

-

ఐపీఎల్ 13వ సీజన్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్న ఢిల్లీ కేపిటల్స్, బుధవారం రాజస్తాన్ రాయల్స్ తో తలపడింది. ఈ మ్యాచులో ఢిల్లీ కేపిటల్స్ 13పరుగుల తేడాతో విజయం అందుకుంది. ఐతే ఈ మ్యాచులో ఢిల్లీ కేపిటల్స్ బౌలర్ అన్ రిచ్ నోర్జే సరికొత్త రికార్డుని సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన బంతిని విసిరి రికార్డు సృష్టించాడు. 156.2 KMPH వేగంతో బంతిని విసిరి అంతకుముందు డేల్ స్టెయిన్ పై ఉన్న (154.4KMPH) రికార్డు బద్దలు కొట్టాడు.

ఈ బంతి విసిరిన తర్వాతి బంతికే జోస్ బట్లర్ ని పెవిలియన్ కి పంపాడు. ఐతే అత్యంత వేగవంతమైన బంతిని విసిరిన మొదటి ఆటగాడిగానే కాదు రెండు మూడు స్థానాల్లోనూ అన్ రిచ్ నిలిచాడు. ఈ ఒక్క మ్యాచులోనే మూడు సార్లు ఫాస్టెస్ట్ బంతుల్ని విసిరాడు. ప్రస్తుతం అత్యంత వేగంగా బంతి విసిరిన జాబితా పరిశీలిస్తే మొదటి మూడు స్థానాల్లో అన్ రిచ్ నోర్జే (156.2 ,155.2, 154.7) ఉండగా నాలుగవ స్థానంలో స్టెయిన్ (154.4KMPH) రబాడా ( 154.2 KMPH) నిలిచారు.

Read more RELATED
Recommended to you

Latest news