కల్వకుంట్ల కుటుంబం తాటాకు చప్పుళ్ళకు భయపడేదే లేదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా తానే పెద్ద నాయకుడిగా కేసీఆర్ ఊహించుకుంటున్నారు అన్నారు. ఫామ్ హౌస్ లో కూర్చుని కేసీఆర్ కంటున్న కలలు కల్లలుగానే మిగిలిపోతాయి అన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే కేసీఆర్ బిజెపిని టార్గెట్ చేశారన్నారు. కల్వకుంట్ల కుటుంబాన్ని తెలంగాణ ప్రజలు చీదరించుకుంటున్నారని విమర్శించారు.
కెసిఆర్ జాతీయ నాయకుడిగా ఎదగడం లో తప్పులేదన్నారు కిషన్ రెడ్డి. కానీ కుటుంబ పార్టీలకు అండగా ఉంటారా? దేశాన్ని కాపాడే వారికి అండగా ఉంటారనేది ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ట్రైబల్ మ్యూజియం పనులు మొదలయ్యాయని, తెలంగాణ ప్రభుత్వం కనీసం స్థలం కూడా కేటాయించలేదన్నారు. జూలై 4న ప్రధాని మోదీ భీమవరంలో పర్యటించే అవకాశాలు ఉన్నాయన్నారు. అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాలను ప్రధాని మోదీ ప్రారంభిస్తారని తెలియజేశారు.