మరోసారి సత్తా చాటిన నిఖత్ జరీన్.. కామన్‌వెల్త్ లో బెర్త్ కన్‌ఫర్మ్..!!

-

తెలంగాణ గోల్డెన్ పంచ్ గర్ల్ నిఖత్ జరీన్ మరోసారి తన ప్రతిభ కనబర్చింది. ఇటీవల ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్‌గా నిలిచిన ఆమె.. ఈ ఏడాది జరగబోయే కామన్‌వెల్త్ క్రీడల్లో బెర్త్ కన్‌ఫర్మ్ చేసుకుంది. దీని కోసం జరిగిన అర్హత పోటీల్లో హర్యానాకు చెందిన మీనాక్షిపై గెలుపొందింది. 7-0 తేడాతో మ్యాచ్ గెలుపొందింది. మ్యాచ్ మొత్తం ఆమె పవర్‌ఫుల్ పంచులతో ప్రత్యర్థిని ముప్పుతిప్పలు పెట్టించింది.

నిఖత్ జరీన్
నిఖత్ జరీన్

దీంతో ప్రత్యర్థి ఆమెపై ఒక్క పంచ్ కూడా వేయలేదు. ఈ విజయంతో నిఖత్ జరీన్ కామెన్‌వెల్త్ క్రీడల్లో పోటీ చేయడానికి లైన్ క్లియర్ అయినట్లు కనిపిస్తోంది. ఆమెతోపాటు ఒలింపిక్స్ లో కాంస్య పతకంతో భారత ఖ్యాతిని పెంచిన లవ్లీనా బోర్గోహెయిన్ కూడా కామన్‌వెల్త్ క్రీడల్లో అర్హత సాధించింది. అలాగే జాస్మిన్ (60కేజీల విభాగం), నీతూ(48 కేజీల విభాగం)లో అర్హత సాధించారు. దీంతో నిఖత్ జరీన్ మరోసారి తెలంగాణ ఖ్యాతిని ప్రపంచానికి తెలిసేలా చేయనుంది.

Read more RELATED
Recommended to you

Latest news