ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల రాజకీయం మాత్రం చాలా హీట్ ఎక్కిస్తుంది. రాజకీయంగా ఇప్పుడు బలంగా ఉన్న అధికార వైసీపీ ఇప్పుడు ఎన్నికలను నిర్వహించాలి అని భావిస్తుంది. దీనిపై ఇప్పుడు విపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. రాజకీయంగా తెలుగుదేశం పార్టీ ఇప్పుడు బలహీనంగా ఉంది కాబట్టి తన బలానికి గానూ ఎన్నికలను వాడుకోవాలని ప్రయత్నాలు చేస్తుంది.
అయితే ఇక్కడ సిఎం జగన్ సహా స్థానిక సంస్థల విషయంలో జోక్యం చేసుకుని, వాటిని వేగంగా జరపాలి అని భావిస్తున్నారు. కరోనా ఉన్న సమయంలో ఇది సాధ్యం కాదు కాబట్టి ఈ 15 రోజుల్లో సాధ్యమైన పరిక్షలు అన్నీ చేసి మే 10 తర్వాత ఎన్నికల నిర్వహణ కోసం ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. ఈ సమయంలో తెలుగుదేశం పార్టీ నుంచి ఒక డిమాండ్ ప్రధానంగా వినపడుతుంది. ఎన్నికల నిర్వహణ విషయంలో… జగన్ నుంచి ఒక ప్రకటన రావాలని,
కరోనా తగ్గే వరకు కూడా ఎన్నికలను నిర్వహించేది లేదని జగన్ నుంచి ప్రకటన రావాలని డిమాండ్ చేస్తుంది. ఈ డిమాండ్ వైసీపీ నుంచి కూడా వినపడుతుంది. అప్పుడు ప్రజల్లో అభిప్రాయం కూడా మారే అవకాశం ఉంటుంది. ప్రజలలో కూడా జగన్ సర్కార్ ఎన్నికల కోసం చూస్తుంది అనే అభిప్రాయం ఉంది. కాబట్టి జగన్ ఒక్క అడుగు వెనక్కి వేసి ఎన్నికల నిర్వహణ ఇప్పట్లో లేదని చెప్పాలని, ఎన్నికల సంఘానికి ఒక లేఖ రాయాలని కోరుతున్నారు.