ఫిబ్రవరి 10 బుధవారం: రాశి ఫలాలు మరియు పరిహారాలు

Join Our Community
follow manalokam on social media

శ్రీరామ ఫిబ్రవరి – 10- పుష్యమాసం- బుధవారం.

 

మేషరాశి:శ్రమ అధికంగా ఉంటుంది !

ఈ రోజు మిశ్రమ ఫలితాలు వస్తాయి. ఆర్థికంగా పర్వాలేదు. వ్యాపారంలో సాధారణ లాభాలు రావచ్చు. ఆఫీస్‌లో వత్తిడి, శ్రమ అధికంగా ఉంటుంది. విద్యార్థులకు నిరాశపరిచే వార్తలు. కానీ వాటిని అధిగమిస్తారు. కుటుంబ జీవితంలో కొత్తదనం ఉంటుంది. వైవాహికంగా బాగుంటుంది. శుభఫలితాల కోసం శ్రీలక్ష్మీగణపతిని గరికతో ఆరాధించండి.

 

todays horoscope

వృషభరాశి:ఆర్థికంగా బాగుంటుంది !

ఈ రోజు సంతోషంగాఉంటుంది. మానసిక ప్రశాంతత, ఆర్థికంగా బాగుంటుంది. మీరు చేసే ప్రయత్నాలు విజయవంతమవుతాయి. కుటుంబ సభ్యుల మద్దతు కూడా లభిస్తుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. ఆఫీస్‌లో పై అధికారులతో ప్రయోజనం పొందుతారు. వైవాహికంగా బాగుంటుంది. శ్రీ ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రదక్షణలు చేయండి.

 

మిథునరాశి:ఎవరికి అప్పులు ఇవ్వకండి !

ఈరోజు శుభసమయం. మంచి ఫలితాలను పొందుతారు. ఆర్థికంగా మంచి రోజు, కానీ ఎవరికి అప్పులు ఇవ్వకండి. మీ తెలివి తేటలతో నూతన అవకాశాలు సృష్టించుకుంటారు. విద్యార్థులు శుభవార్తలను పొందుతారు. కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని గడపుతారు. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. వైవాహికంగా బాగుంటుంది.

 

కర్కాటకరాశి:కొత్త ఒప్పందాలు చేసుకుంటారు !

ఈరోజు బాగుంటుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఆర్థికంగా బాగుంటుంది. కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. ఆఫీస్‌ల్లో విజయాన్ని అందుకుంటారు. ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. వాహనాల కొనుగోళ్లు ఉంటాయి. బంధువుల రాక సంతోషాన్నిస్తుంది. మీకు శుభవార్త అందే అవకాశం ఉంది. వైవాహికంగా బాగుంటుంది.

 

సింహరాశి:విద్యార్థులకు విజయం లభిస్తుంది !

ఈరోజు అన్నింటా విజయం సాధిస్తారు. ఆర్థికంగా చాలా మంచిరోజు. వ్యాపారాలు బాగుంటాయి. ఆఫీస్‌లో మీ ప్రభావం పెరుగుతుంది. అధికారులతో సంబంధాలు బలపడతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. విద్యార్థులకు విజయం లభిస్తుంది. వైవాహికంగా బాగుంటుంది. మంచి ఫలితాలకోసం ఓం గం గణపతయేనమః అనే మంత్రాన్ని పారాయణం చేసుకోండి.

 

కన్యరాశి:చిన్నచిన్న వివాదాలు వస్తాయి !

ఈరోజు మిశ్రమ ఫలితాల వస్తాయి. ఈరోజు ఆర్థికంగా సాధారణంగా ఉంటగుంది. వ్యాపారం చేసే వారు ప్రయోజనం పొందుతారు. కుటుంబ సభ్యులతో చిన్నచిన్న వివాదాలు వస్తాయి. కానీ రాత్రికల్లా వాటిని అధిగమిస్తారు. బంధువుల నుంచి సంతృప్తికరమైన వార్తలను వింటారు. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. సున్నితమైన సమస్యలపై జాగ్రత్తగా స్పందించాలి. వైవాహికంగా బాగుంటగుంది.

 

తులరాశి:కుటుంబ  సభ్యుల నుంచి మద్దతు ఉంటుంది !

ఈరోజు సానుకూలమైన వాతావరణం ఉంటుంది. ఆర్థికంగా కష్టాల నుంచి గట్టెక్కుతారు. వ్యాపారులకు సాధారణంగా ఉంటుంది. కుటుంబ  సభ్యుల నుంచి మద్దతు ఉంటుంది. బంధువుల నుంచి వివాదాలు వస్తాయి. కానీ సామరస్యంగా పరిష్కరించుకుంటారు. శత్రువులు కూడా పెరుగుతారు. వైవాహికంగా బాగుంటుంది. అనుకూలమైన ఫలితాల కోసం శ్రీకాలభైరవాష్టకం పారాయణం చేయండి.

 

 

వృశ్చికరాశి:ఆఫీస్‌ జాగ్రత్తగా ఉండండి !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఆర్థికంగా బాగుంటుంది. కానీ అప్పులు ఇస్తే అవి మీ అవసరాలకు రావు.  వ్యాపారాన్ని లాభాల బాటలో పయనింప చేస్తారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఆఫీస్‌ జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులకు బాగా శ్రమించాల్సిన సమయం. కుటుంబ సభ్యులతో వాదనలు పెట్టుకోకండి. వైవాహికంగా బాగుంటుంది. మంచి ఫలితాల కోసం శ్రీకృష్ణాష్టకం పారాయణం చేయండి.

 

ధనస్సురాశి:విద్యార్థులు ఆశించిన ఫలితాలు రావు !

ఈరోజు బాగా శ్రమించాల్సిన రోజు. ఆర్థికంగా  బాగుండదు. వ్యాపారంలో కష్టపడి పనిచేస్తే లాభాలను అందుకుంటారు. కుటుంబ సభ్యులతో సమస్యలు రావచ్చు. కానీ పెద్దల సహాయంతో వాటి నుంచి బయటపడుతారు. బంధువుల నుంచి శుభవార్తలు ఉంటాయి. విద్యార్థులు ఆశించిన ఫలితాలు రావు. భవిష్యత్‌ ప్రణాళికలు వేసుకుంటారు. వైవాహికంగా ఇబ్బందులు కానీ వాటిని ఓపికతో అధిగమిస్తారు. శుభఫలితాల కోసం నవగ్రహారాధన చేయండి.

 

మకరరాశి:బంధువుల నుంచి వివాదాలు రావచ్చు !

ఈరోజు కష్టపరిస్థితులు రావచ్చు. ఆర్థికంగా బాగుండదు. వ్యాపారులకు బాగుండదు. కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలు నెరుపుతారు. బంధువుల నుంచి వివాదాలు రావచ్చు. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఆఫీస్‌లో సహచర ఉద్యోగుల గౌరవం ఉంటుంది. విద్యార్థులకు కష్టకాలం. వైవాహికంగా బాగుంటుంది. శుభఫలితాల కోసం శ్రీ శివపంచాక్షరీ మంత్రాన్ని జపించండి.

 

కుంభరాశి:విద్యార్థులు మరింత కష్టపడాలి !

ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. ఆర్థిక విషయాలను జాగ్రత్తగా నిర్వహించండి. వ్యాపారాలు మందకొడిగా ఉంటాయి. అప్పుల కోసం ప్రయత్నాలు చేస్తారు. కానీ ఎవరికి అప్పులు ఇవ్వకండి. మంచి మార్కుల కోసం విద్యార్థులు మరింత కష్టపడాలి. పెట్టుబడులు పెట్టేముందు జాగ్రత్తగా అన్ని విషయాలు పరిశీలించుకోండి. ఇంట్లో మీ బాధ్యతలను నెరవేర్చడంలో బిజీగా ఉంటారు. ప్రతికూల వార్తలను వినాల్సి రావచ్చు. వైవాహికంగా సాధారణ పరిస్థితి. శుభఫలితాల కోసం శ్రీఆంజనేయస్వామి దేవాలయంలో ప్రదక్షణలు చాలీసా పారాయణం చేయండి.

 

మీనరాశి:ఆర్థిక పరిస్థితులు అనుకూలం !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితులు అనుకూలం. వ్యాపారులకు సాధారణ లాభాలు వస్తాయి. కుటుంబ జీవితంలో రోజులుగా కొనసాగుతున్న ప్రతిష్ఠంభన ముగుస్తుంది. భవిష్యత్‌ ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు. బంధువులతో వాదనలు పెట్టుకోవద్దు. విద్యార్థులు శ్రమించాల్సిన పరిస్థితి ఉంటుంది.వైవాహికంగా బాగుంటుంది. అనుకూలమైన ఫలితాల కోసం శ్రీశివపంచాక్షరీ జపించండి.

 

  • శ్రీ

 

TOP STORIES

భక్తి: మాఘ పౌర్ణమి నాడు ఏం చెయ్యాలి..?

మాఘ పౌర్ణమి చాల ప్రత్యేకమైన రోజు. ఆరోజు హిందువులు ప్రత్యేక పూజలు చేయడం, నదీ స్నానాలని చేయడం చేస్తారు. అలానే ధానం చేయడం మొదలైన వాటిని...