టాలీవుడ్ ప్రెస్టీజియస్ ఫిలింస్ కు విలన్లు దొరకినట్లేనా

విలన్స్ రెడీ అయిపోయారు.ఇంతకాలం ఆయా ఫిలింస్ కు విలన్ ఎవరో తెలియక సతమతమైన అభిమానులకు ఇప్పుడు ఆల్మోస్ట్ కన్ఫామ్ న్యూస్ రావడంతో పండగ చేసుకుంటున్నారు.తమ అభిమాన హీరోలు ఆయా విలన్స్ ను ఎలా ఫేస్ చేస్తారో ఎలాంటి యాక్షన్ పండిస్తారో చూడాలని పలువురు ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

తెలుగు సినీ పరిశ్రమలో సెట్ప్ మీదున్న సినిమాలకు త్వరలో సెట్స్ పైకి వెళ్లబోయే ప్రాజెక్ట్ లకు విలన్స్ ఎవరో చూద్దామని పలువురు సినీ ప్రియులు గత కొంతకాలంగా ఎదురుచూస్తూ వచ్చారు.తాజాగా వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం ఇప్పటికే మూడు సినిమాలకు విలన్స్ కన్ఫామ్ అయిపోయారు.వారిలో ముందుగా బాలయ్యబాబు-బోయపాటిల సినిమా ప్రధానంగా కనిపిస్తుంది.హీరోలు శ్రీకాంత్ ,సునీల్ శెట్టిలు బాలయ్యను ఢీకొట్టే పాత్రలో కనిపించనున్నారు.లెజండ్ లో విలన్ జగపతిబాబును హ్యాండిల్ చేసిన బాలయ్యకు ఇప్పుడు శ్రీకాం్ ,సునీల్ శెట్టిలను విలన్స్ గా ట్రీట్ చేస్తూ హ్యండిల్ చేసే అవకాశం రావడం విశేషం.

ప్రశాంత్ నీల్ బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ “సలార్”లో ప్రభాస్ లాంటి సాలిడ్ కటౌట్ ను మ్యాచ్ చెయ్యగలిగే విలన్ ఫలాన అంటూ చాలా మంది టాప్ అండ్ టాలెంటెడ్ నటులు పేర్లు వినిపించాయి. కానీ తాజా అప్ డేట్ ఏంటంటే ఈ సినిమాకు గాను నీల్ కన్నడ ఇండస్ట్రీకు చెందిన మోస్ట్ హ్యాపెనింగ్ విలన్ మధుగురు స్వామిని తీసుకున్నట్టుగా తెలుస్తుంది.ఐతే దీనిపై నీల్ అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంది.

ఇక లేటెస్ట్ గా త్వరలో సెట్స్ మీదకు వెల్లబోయే తారక్ -త్రివిక్రమ్ ప్రాజెక్ట్ అప్ డేట్ ఒకటి బయటకు వచ్చింది. త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్ లో ప్లాన్ చేస్తున్నాడు. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ కి విలన్ గా మరో హీరో నటించబోతున్నాడు.అతడే తమిళ హీరో శింబు.ఈయనగారిని విలన్ గా తీసుకోబోతున్నారట. ఇక కమెడియన్ సునీల్ కూడా ఈ సినిమాలో ఓ డిఫరెంట్ విలన్ రోల్ లో నటిస్తున్నట్లు తెలుస్తోంది.అయితే వీరిద్దరిలో విలన్ గా ఎవరి ఇంపార్టెన్స్ ఎంతో త్వరలో వచ్చే అప్ డేట్ తో తెలిసే ఛాన్స్ ఉంది.