సంబంధిత కమిటీ తన నివేదిక ఇచ్చిన వెంటనే పెళ్లికి సరైన వయస్సును ప్రభుత్వం నిర్ణయిస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం దేశ ప్రజలను ఉద్దేశించి అన్నారు. మన కుమార్తెల వివాహానికి సరైన వయస్సు నిర్ణయించడానికి చర్చ జరుగుతోందని మోడీ చెప్పారు. సంబంధిత కమిటీ ఇంకా ఎందుకు నిర్ణయం తీసుకోలేదని దేశవ్యాప్తంగా కుమార్తెలు నాకు లేఖ రాశారని ఆయన అన్నారు.
నివేదిక వచ్చిన వెంటనే ప్రభుత్వం మీకు గుడ్ న్యూస్ చెప్తామని అన్నారు. మహిళల ఆరోగ్యం, పరిశుభ్రత నిర్వహణకు తన ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి కూడా మాట్లాడారు. “మన కుమార్తెల శ్రేయస్సు కోసం మేము తగిన చర్యలు తీసుకుంటున్నాము. జల్ జీవన్ మిషన్ ద్వారా, ప్రతి ఇంటికి నీరు అందించే పని జరుగుతోంది. ఒక్కొక్కరికి 1 రూపాయి చొప్పున సానిటరీ ప్యాడ్ అందిస్తున్నాము” అని ఆయన చెప్పారు.