కత్తి కార్తీక పై చీటింగ్ కేసు నమోదు…!

-

ఎన్టీఆర్ హోస్ట్ చేసిన బిగ్ బాస్ సీజన్ 1లో కంటెస్టెంట్‌గా తెలంగాణ యాస భాషలతో అలరించిన బ్యూటీ కంటెస్టెంట్ కత్తి కార్తీక పై చీటింగ్ కేసు నమోదైంది. ఒక ల్యాండ్ ఇష్యూ సెటిల్ చేస్తా అంటూ కోటి రూపాయల మోసానికి పాల్పడ్డ కార్తీక , ఆమె అనుచరుల పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు.

అమీన్ పూర్ వద్ద 52 ఎకరాల భూమిని ఒక ప్రైవేట్ కంపెనీ కి ఇప్పించేందుకు మద్య వర్తిత్వం చేసిన కార్తీక బాధితుడి దగ్గర కోటి రూపాయలు సెక్యూరిటీ డిపాజిట్ చేయించుకున్న కార్తీక రెడ్డి, అనుచరుల పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాధితుడు దీంతో కార్తీక పై కేసు నమోదు చేశారు పోలీసులు. దుబ్బాక ఉప ఎన్నికల్లో బహుజన ఆడబిడ్డ గా పోటి చేస్తున్నా అంటూ ఈ మధ్య హల్ చల్ చేసింది.ప్రస్తుతం ఆమె దుబ్బాక ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news