ఫెంగ్ షుయ్ టిప్స్: ఇలా పాటిస్తే పక్కా సమస్యల నుండి బయట పడచ్చు..!

-

ప్రతి ఒక్కరికి ఆనందంగా ఉండాలని ఉంటుంది. ఏ బాధ లేకుండా హాయిగా ఉండాలని అనుకుంటుంటారు. మీరు కూడా బాధల నుండి బయట పడాలనుకుంటే చైనీస్ ఫిలాసఫికల్ సిస్టం చెప్తున్న మార్గాలని చూడాల్సిందే. ఆరోగ్యం బాగుంటుంది పైగా సమస్యల నుండి బయటకి వచ్చేయచ్చు. ఎప్పుడూ కూడా ఇంట్లో మంచి ఎనర్జీ ఉండాలంటే చెత్తను తొలగించాలి ఇంట్లో ఉండే వీటి వలన ఇబ్బందుల్ని కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. అవసరమయ్యేవి మాత్రమే ఇంట్లో ఉంచుకోండి. చెత్తా చెదారాన్ని మీ ఇంట్లో ఉంచితే ప్రశాంతత ఉండదు. ఇబ్బందులు ఉంటాయి. ఫర్నిచర్ ని సరిగ్గా ఉంచుకోవడం కూడా చాలా ముఖ్యం.

ఫర్నిచర్ ని మంచిగా అరేంజ్ చేసుకుంటే ఎనర్జీ బాగుంటుంది. తలుపు వెనకాల ఫర్నిచర్ వంటివి పెట్టకండి అలానే ఫర్నిచర్ ఎప్పుడూ కూడా అందంగా ఉండేటట్టు చూసుకోవాలి. రంగులను కూడా మంచిగా ఉంచుకోవాలి. రంగులే ఎమోషన్స్ ని హ్యాండిల్ చేయగలవు. ఎనర్జీ ఫ్లో అయ్యేటట్టు చేయాలంటే రంగులతో మీరు జాగ్రత్తగా ఉండాలి.

నీలం నీళ్లు, ఎరుపు మంట, పసుపు భూమి, ఆకుపచ్చ వుడ్, తెలుపు మెటల్. ఎనర్జీ బ్యాలెన్స్ అవ్వాలంటే మీరు ఈ రంగులను ఉపయోగించండి. ఇంట్లో డ్రాగన్, తాబేలు, చేప వంటివి పెడితే కూడా పాజిటివ్ ఎనర్జీ వచ్చి నెగటివ్ ఎనర్జీ దూరమవుతుంది. అలానే గాలి వెల్తురు కూడా ఇంట్లోకి బాగా వచ్చేటట్టు చూసుకోవాలి ఇలా ఈ విధంగా మీరు ఫాలో అయితే కచ్చితంగా సమస్యలను దూరంగా ఉండొచ్చు ఆనందంగా ఉండొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news