దళిత మహిళను లాకప్ డెత్ చేయించిన వ్యక్తి అంబేద్కర్ వారసుడా..? – వైఎస్ షర్మిల

-

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అంటరానితనం, కుల వివక్షతకు వ్యతిరేకంగా పోరాడి, అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషిచేసి, భారత రాజ్యాంగాన్ని రచించిన గొప్ప వ్యక్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని అన్నారు.

ఆ మహనీయుడి స్ఫూర్తితోనే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పని చేస్తుందన్నారు షర్మిల. 80 వేల పుస్తకాలు చదివిన అపర మేధావి కేసిఆర్ గారు మేము పంపిన రాజ్యాంగ పుస్తకాన్ని తీరికగా చదివి.. రాష్ట్రంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అమలు చేయాలని కోరారు. నియంత పాలన మానుకొని ప్రజలకు సమాన హక్కులు, ప్రతిపక్షాలకు ప్రశ్నించే హక్కులు కల్పించాలని విన్నవించారు.

దళితులను అణగదొక్కి, వాళ్ళ భూములను లాక్కొని, దళిత మహిళలను చిత్రహింసలకు గురిచేసిన కేసిఆర్ అంబేద్కర్ వారసుడా..? దళిత ముఖ్యమంత్రి, దళితులకు మూడెకరాల భూమి హామీలను పాతరేసి, దళిత మహిళను లాకప్ డెత్ చేయించిన వ్యక్తి అంబేద్కర్ వారసుడని చెప్పుకోవడానికి కొంచమైనా సిగ్గుండాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు షర్మిల.

Read more RELATED
Recommended to you

Latest news