ఆగ‌ష్టు నెల‌లో పండుగ‌లు.. ఏ పండుగ ఎప్పుడు..

-

భారతదేశం విభిన్న మతాలు, ఆచారాలు, సంప్రదాయ వ్యవహారాలకు నెలవు. కాగా, భిన్నత్వంలో ఏకత్వం భారత వారసత్వంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో ప్రధానంగా ఈ ఆగస్టు నెలలో పండుగలు బోలెడు ఉన్నాయి. ఒక రకంగా ఆగస్టును పండుగల నెలగా పిలువొచ్చని పెద్దలు చెప్తుంటారు. ఈ నెలలో నిర్వహించుకోబోయే పండుగలేంటో తెలియాలంటే మీరు ఈ స్టోరీ చదవాల్సిందే.

rakhi festival wishes to sister
rakhi festival wishes to sister

ప్రధాన పండుగలతో పాటు ముఖ్యమైన రోజులు ఈ ఏడాది ఆగస్టు నెలలోనే ఎక్కువగా ఉన్నాయట.

  • ఆగస్టు 15న జరుపుకునే స్వాతంత్ర్యదినోత్సవం దేశమంతటా పెద్ద పండుగే. ఈ రోజున దేశవ్యాప్తంగా జాతీయ జెండా ఆవిష్కరణతో పాటు వేడుకలు జరుపుకుంటుండటం ఆనవాయితీ.
  • ఆగస్టు 6న సవాన్​ శివరాత్రి.
  • ఆగస్టు 8 శరణవ అమావాస్య.
  • ఆగస్టు 10 అల్​ – హిజ్రా లేదా ఇస్లామిక్​ న్యూ ఇయర్.
  • ఆగస్టు 11 హరియాలి తీజ్​, హర్తాలికా తీజ్.​
  • ఆగస్టు 13 నాగుల పంచ‌మి.
  • ఆగస్టు 17 మళయాల నూతన సంవత్సరం.
  • ఆగస్టు 18 శ్రావణ పుత్రదా ఏకాదశి.
  • ఆగస్టు 19 మొహర్రం.
  • ఆగస్టు 20 వరలక్ష్మి వ్రతం.
  • ఆగస్టు 21 ఓనం పండుగ.
  • ఆగస్టు 22 రాఖీ పౌర్ణమి, శ్రావణ పూర్ణిమ.
  • ఆగస్టు 25 కజారి తీజ్​.
  • ఆగస్టు 30 శ్రీ క్రిష్ణ జన్మాష్టమి.
  • ఆగస్టు 31 దహీ హండి.
    ఈ పండుగలను కుల, మతాలకతీతంగా నిర్వహించుకోవడం ఇంకా ప్రత్యేకం. అయితే, ప్రాంతానికో సెపరేట్ ట్రెడిషన్ ఉన్నట్లు ఒక ప్రాంతానికి ఇంకో ప్రాంతానికి మధ్య కొంచెం తేడాతో పండుగలు ఉన్నాయి. తమ పూర్వీకుల నుంచి వచ్చిన పలు పండుగలను సాంస్కృతికంగా నిర్వహించుకుంటారు భారతదేశ ప్రజలు. అందరి పండుగలను భక్తి భావంతో జరుపుకుంటూ ఉంటారు.

Read more RELATED
Recommended to you

Latest news