Chiranjeevi: ‘ఆచార్య’ తర్వాత వచ్చే మెగాస్టార్ సినిమా అదే..క్లారిటీనిచ్చిన మేకర్స్

-

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తెలుగు ప్రేక్షకులకు చివరగా ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంలో కనిపించారు. ఆ సినిమా తర్వాత వెంటనే ఆయన నటించిన సినిమా ‘ఆచార్య’ వస్తుందని అనుకున్నారు. ఈ విషయమై తాను వంద రోజుల్లోనే చిత్ర షూటింగ్ కంప్లీట్ చేయాలని అనుకుంటున్నానని చిరంజీవి చెప్పారు కూడా. కానీ, కరోనా మహమ్మారి వలన ఏర్పడ్డ పరిస్థితులు ఈ సినిమా తీయడానికి మూడున్నరేళ్లు పట్టేలా చేసింది.

అలా సినిమా మేకింగ్ లో టైం పట్టింది. ఎట్టకేలకు ఈ నెల 29న సినిమా విడుదల కానుంది. కాగా, మెగాస్టార్ నటిస్తు్న్న నెక్స్ట్ సినిమాలు రిలీజ్ కావడానికి మళ్లీ ఎంత టైం పడుతుందని మెగా అభిమానులు చర్చించుకుంటున్న నేపథ్యంలో ‘ఆచార్య’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే ‘ఆచార్య’ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించన సినిమాల్లో రాబోయేది ఏదో ఇన్ డైరెక్ట్ గా క్లారిటీ ఇచ్చేశారు.

 

 

మలయాళ సూపర్ హిట్ ఫిల్మ్ ‘లూసిఫర్’ అఫీషియల్ తెలుగు రీమేక్ గా వస్తున్న ‘గాడ్ ఫాదర్’ పిక్చర్ ‘ఆచార్య’ తర్వాత వస్తుందని చెప్పకనే చెప్పేశారు. షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్లు తెలుస్తుండగా, డబ్బింగ్ పార్ట్ కొంత మిగిలి ఉందని డైరెక్టర్ మోహన్ రాజా తెలిపారు.

ప్రొడ్యూసర్ ఎన్ వీ మాట్లాడుతూ ‘ఆచార్య’ తర్వాత రాబోయేది ‘గాడ్ ఫాదర్’ మూవీనేని చెప్పారు. ఇక ఆ తర్వాత ‘భోళా శంకర్’, ఆ తర్వాత బాబీ – చిరుల MEGA 154(వాల్తేరు వీరయ్య అనే టైటిల్ ప్రచారంలో ఉంది)’, ఆ తర్వాత వెంకీ కుడుముల- చిరంజీవి ప్రాజెక్టు రిలీజ్ కావొచ్చని సినీ అభిమానులు అంచనా వేస్తున్నారు. ‘గాడ్ ఫాదర్’ పిక్చర్ ను కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిల్మ్స్ వారు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news