ఆ పాటలో 8 మంది హీరో, హీరోయిన్స్… ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసా?

-

సాధారణంగా ఓ సినిమాలో లేదా ఓ పాటలో.. మరో హీరో లేదా హీరోయిన్​ గెస్ట్​ అప్పియరెన్స్​లో కనిపిస్తుండటం సహజం.అయితే ఓ చిత్రంలోని పాటలో మాత్రం ఏకంగా ఎనిమంది హీరోలు, ఎనిమిది మంది హీరోయిన్లు గెస్టులుగా కనిపించి అభిమానులను ఉర్రూతలూగించారు. ఎంతలా అంటే కేవలం ఆ ఒక్క పాట కోసమే థియేటర్లకు ప్రేక్షకులు పోటెత్తారు. ఇంతకీ ఆ చిత్రం ఏంటో తెలుసుకుందాం..

1987లో కె.మురళీ మోహనరావు దర్శకత్వంలో మల్టీస్టారర్​గా విక్టరీ వెంకటేష్, యాక్షన్ కింగ్ అర్జున్, నటకిరీటి రాజేంద్రప్రసాద్ హీరోలుగా కలిసి నటించిన చిత్రం త్రిమూర్తులు. శోభన, ఖుష్బు, అశ్వినీ హీరోయిన్స్. 1981లో విడుదలైన హిందీ చిత్రం నసీబ్​కు రీమేక్​గా 1987లో త్రిమూర్తులు విడుదలైంది యావరేజ్ టాక్​ను దక్కించుకుంది.

అయితే న‌సీబ్ సినిమాలోని ఓ పాట‌లో బాలీవుడ్​కు చెందిన టాప్ హీరోస్ అంద‌రూ గెస్ట్ అప్పియ‌రెన్స్​లో కనిపించి ఫ్యాన్స్​ను అలరించారు. అదే తరహాలోనే తెలుగు రీమేక్​లోనూ టాలీవుడ్​ టాప్ హీరోస్ ఓ సాంగ్​లో క‌నిపించాల‌ని నిర్మాత సుబ్బిరామిరెడ్డి భావించి 7 మంది హీరోల‌ు, నలుగురు హీరోయిన్స్​తో మాట్లాడి ఒప్పించారు. అలా ‘త్రిమూర్తులు’ చిత్రంలో ఒకే పాటలో ప్రముఖ స్టార్స్ అందరూ కనిపించిన ఆ పాటే.. ‘ఒకే మాట‌, ఒకే బాట.. మతం లేదు.. కులం లేదు..’

ఈ పాట‌లో వెంక‌టేష్ తోపాటు శోభ‌న్‌బాబు, విజ‌య‌శాంతి, కృష్ణ‌, విజ‌య‌నిర్మ‌ల‌, చిరంజీవి, రాధిక‌, కృష్ణం రాజు, రాధ‌, ముర‌ళీ మోహ‌న్, శార‌ద‌, బాల‌కృష్ణ‌, భానుప్రియ, నాగార్జున‌, సుమలత, చంద్ర‌మోహ‌న్‌, జ‌య‌మాలిని లు క‌నిపిస్తారు. మొద‌ట‌గా ఈ చిత్రంలో గెస్ట్ అప్పియరెన్స్ కోసం ఎన్టీఆర్, ఏఎన్ఆర్​లను సంప్రదించారట. కానీ అది కుదరక వారి స్థానాల్లో బాల‌కృష్ణ‌, నాగార్జున‌ క‌నిపించి అందరినీ ఆకట్టుకున్నారు. అప్పట్లో కేవ‌లం ఈ పాట‌ను చూడ‌డానికే ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టేవారట.

Read more RELATED
Recommended to you

Latest news