యూపీఐ పేమెంట్ పరిమితి మొదలు మే నెలలో ఈ 4 అంశాలలో మార్పు…!

-

ప్రతీ నెల ప్రారంభంలో కూడా పలు విషయాల్లో మార్పులు వస్తూ ఉంటాయి. అలానే మే లో కూడా కొన్ని మార్పులు వచ్చాయి. పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వే పై టోల్ సేకరణ నుంచి రిటైల్ ఇన్వెస్టర్లకు యూపీఐ పేమెంట్ దాకా పలు మార్పులు వచ్చాయి.

- Advertisement -

మరి వాటిని తప్పక తెలుసుకోవాల్సి వుంది. మరి ఇక పూర్తి వివరాల లోకి వెళితే.. ఈ అంశాలు మీ ఫైనాన్సియల్స్‌ను నేరుగా ప్రభావితం చేస్తాయి కనుక అవేమిటో చూసేద్దాం.

బ్యాంకుల సెలవులు:

బ్యాంకుకు సంబంధించిన ఏమైనా పనులు చేసుకోవాల్సి ఉంటే కష్టం. ఎందుకంటే మే డే, రంజాన్ సెలవులు వున్నాయి. మే 1 నుంచి మే 3 వరకు బ్యాంకులు మూత పడుతున్నాయి. అయితే ఇది అన్ని చోట్ల కాదు. మీ ప్రాంతంలో బ్యాంకులు ఏ రోజు మూత పడతాయో ముందస్తుగానే తెలుసుకోవాలి లేదంటే ఇబ్బంది పడతారు.

పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై పన్ను సేకరణ:

ఉత్తర ప్రదేశ్‌ రాజధాని లక్నోను ఘజియాపూర్‌ను అనుసంధానిస్తూ ఉన్న 340 కి.మీ పూర్వాంచల్ ఎక్స్‌ప్రె‌స్‌వేపై టోల్ పన్నును విధిస్తోంది. ఇది నేటి నుండి అమలులోకి రానుంది. దీనితో ఈ ట్రైన్ లో ప్రయాణించడం ఖరీదుగా కనపడుతోంది. పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై కి.మీకు రూ.2.45 రేటు ప్రకారం టోల్ ట్యాక్స్‌ను ప్రభుత్వం విధించనుందని తెలుస్తోంది.

సిలిండర్ ధర:

ఒకటవ తేదీన సిలిండర్ ధరలను మారుస్తాయి కంపెనీలు. చివరి సారి ఒక్కో సిలిండర్‌పై రూ.50 మేర ధరను పెంచాయి. ఈ నెల కూడా వీటి ధరలు పెరిగేలానే కనపడుతోంది.

ఐపీఓలో యూపీఐ పేమెంట్ లిమిట్:

రిటైల్ ఇన్వెస్టర్ అయి, యూపీఐ పేమెంట్ల ద్వారా ఏదైనా కంపెనీ ఐపీఓలో పెట్టుబడులు పెట్టాలంటే సెబీ ఊరటనిచ్చింది. అయితే ఇప్పుడు రూ. 5 లక్షల వరకు బిడ్స్ వేసుకోవచ్చు. ఇది వరకు ఇది లక్ష మాత్రమే.

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...