అమెజాన్ ప్రైమ్ కి షాక్.. నిర్మాతతో పాటు వాళ్లకి కూడా..

-

ఇండియాలో మేజర్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అయిన అమెజాన్ ప్రైమ్ పై ఎఫ్ ఐ ఆర్ దాఖలైంది. దానికి కారణం ప్రస్తుతం ప్రదర్శితం అవుతున్న తాండవ్ సిరీస్ లోని కొన్ని సీన్లే. సైఫ్ ఆలీ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన తాండవ్ సిరీస్ లో కొన్ని సీన్లు హిందువుల మనోభావాలను కించపరిచే విధంగా ఉన్నాయని, హిందూ దేవతలని కించపరిచే విధంగా సీన్లు చిత్రీకరించారని హిందూ సంఘాలు తాండవ్ టీమ్ పై ఫిర్యాదు చేసింది. ఈ మేరకు సోషల్ మీడియాలో పెద్ద ఉద్యమమే నడుస్తుంది.

బాయ్ కాట్ బాలీవుడ్ అంటూ సోషల్ మీడియాలో రచ్చ లేపుతున్నారు. ఉత్తరప్రదేశ్ లోని హజ్రత్ గంజ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సిరీస్ దర్శకుడు ఆలీ అబ్బాస్, అమెజాన్ హెడ్ ఇండియా అపర్ణ, నిర్మాత హిమాన్షు, రచయిత సోలంకిల పై ఎఫ్ ఐ ఆర్ దాఖలు చేసారు. ఈ విషయమై అమెజాన్ ప్రైమ్ కి కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ నుండి నోటీసులు కూడా వచ్చాయి. మరి ఈ వివాదం ఎక్కడి వరకు దారితీస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news