దేశ రాజధానిలో భారీ అగ్నిప్రమాదం.. భారీ ఆస్తి నష్టం

-

దేశ రాజధాని ఢిల్లీలోని కూరగాయల మార్కెట్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఢిల్లీలోని ఆజాద్‌పూర్‌ కూరగాయల మార్కెట్‌లో ఇవాళ మధ్యాహ్నం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో.. కూరగాయలు అమ్మే వ్యాపారులు, కొనేందుకు వెళ్లిన కస్టమర్లు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని బయటికి పరుగులు తీశారు.

అయితే.. చూస్తుండగానే మార్కెట్‌ అంతటా మంటలు వ్యాపించాయి. కూరగాయలు, ఇతర సామాగ్రి పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. మంటలను ఆర్పేందుకు స్థానికులు తీవ్రంగా శ్రమించారు. అయితే.. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. అయితే.. అగ్నిమాపక సిబ్బందిని రప్పించి  ఫైరింజన్‌ల సాయంతో మూడు గంటల పాటు శ్రమించి మంటలను ఆర్పేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి కారణం తెలియాల్సి ఉందన్నారు. విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూటే ప్రమాదానికి కారణమై ఉంటుందని ప్రాథమిక అంచనాకు వచ్చారు. ప్రమాదంలో ఆస్తి నష్టమే తప్ప ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని చెప్పారు. దీంతో నష్టపోయిన కూరగాయల వ్యాపరస్థులు ప్రభుత్వం ఆదుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version