ప్రభాస్ హీరోగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆది పురుష్ సినిమా ఈ రోజు పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే ఈ రోజు ప్రారంభమైన కొద్ది సేపటికే ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న ముంబై స్టూడియో లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో సినిమాకోసం వేసిన గ్రీన్ మ్యాట్స్ అన్నీ కాలిపోయాయి అని తెలుస్తోంది. అయితే ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని కేవలం ఆస్తి నష్టం మాత్రమే జరిగిందని తెలుస్తోంది.
అయితే ఈ ఘటనకు సంబంధించి ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొదటి రోజు ఇలా జరగడం ఏంటని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. తాజాగా ఈ అంశం మీద హీరో మంచు మనోజ్ స్పందించారు. మొదటి రోజు ఇలా జరగడం వల్ల దిష్టి పోతుందని ఆయన చెప్పుకొచ్చాడు. అయితే అసలు అగ్ని ప్రమాదానికి కారణం ఏమిటి అనేది మాత్రం తెలియాల్సి ఉంది.