ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం.. మంటలార్పుతున్న 16 ఫైరింజన్లు

న్యూఢిల్లీ: లజ్‌పత్ నగర్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సెంట్రల్ మార్కెట్‌‌లోని దుస్తుల షోరూమ్‌లో మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ మంటలు పక్కనున్న షాపులకు కూడా అంటుకున్నాయి. దీంతో ఆ ప్రాంతమంతా పొగలు అలుముకున్నాయి.

విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది 16 ఫైరింజన్లతో మంటలార్పుతున్నారు. మొత్తం 70 మందితో మంటలార్పేందుకు యత్నిస్తున్నారు. మార్కెట్‌లోని మిగిలిన షాపులను ఖాళీ చేయిస్తున్నారు.  మార్కెట్‌లో 100 మీటర్ల వరకూ తమ అధీనంలోకి తీసుకున్నారు. ఇప్పటివరకూ ఎలాంటి ప్రాణ నష్టం లేదని నిర్ధారించారు. ఇంకా ఎవరన్నా ఉన్నారా అనే అనేదానిపై క్షణ్ణంగా పరిశీలిస్తున్నారు.