బ్రేకింగ్ : టేకాఫ్ అవుతుంటే విమానంలో మంటలు..

-

చైనాలోని చాంగ్ కింగ్ ఎయిర్ పోర్టులో ఘోర విమాన ప్రమాదం తప్పింది. టిబెట్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. టేకాఫ్ కు విమానం సిద్ధమైన సమయంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటన జరిగిన సమయంలో విమానంలో 113 మంది ప్రయాణికులు, 9 మంది విమాన సిబ్బంది ఉన్నారు. మంటలు చెలరేగిన వెంటనే అప్రమత్తమైన విమానాశ్రయ సిబ్బంది… ప్రయాణికులను, విమాన సిబ్బందిని అత్యవసర మార్గాల గుండా కిందకు దించారు. ఈ ప్రమాదంలో 25 మందికి గాయాలయ్యాయి. విమానం నైరుతి నగరం చాంగ్‌కింగ్ నుండి టిబెట్‌లోని న్యింగ్‌చికి వెళుతుండగా, సిబ్బంది విమానంలో ఏదో తేడా, “సస్పెండ్ టేకాఫ్” గమనించామని, అంతలోనే జెట్ రన్‌వేను నుంచి జారిపోయిందని, వెంటనే రంగంలోకి దిగి మంటలను ఆర్పినట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.

దీంతో జెట్ లోని ప్రయాణికులు భయాందోళనకు గురై సంఘటనా స్థలం నుండి పరుగులు తీశారు. ప్రమాదానికి గురైన జెట్ రెక్కలకు మంటలు వ్యాపించినట్లు చైనా ప్రభుత్వ మీడియా షేర్ చేసిన ఫొటోల్లో కనిపిస్తుంది. అయితే ఈ ప్రమాదంలో ఎవ్వరికీ ఏమీ కాలేదని, ప్రయాణికులు, సిబ్బంది అందరూ సురక్షితంగా ఖాళీ చేయబడ్డారు” అని టిబెట్ ఎయిర్‌లైన్స్ ఒక ప్రకటనలో తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news