బఠిండా మిలిటరీ స్టేషన్​లో కాల్పులు.. నలుగురు దుర్మరణం

-

పంజాబ్‌లోని ఓ సైనిక శిబిరంలో కాల్పుల మోత మోగింది. ఇవాళ తెల్లవారుజామున 4.35 గంటల ప్రాంతంలో బఠిండాలోని మిలిటరీ స్టేషన్‌లో ఆగంతకులు కాల్పులు జరిపారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా.. పలువురు గాయపడినట్లు తెలుస్తోంది.

కాల్పులు వినిపించగానే స్టేషన్‌లోని క్విక్‌ రియాక్షన్ బృందాలు అప్రమత్తమయ్యాయి. వెంటనే ఆ ప్రాంతాన్ని ఆధీనంలోకి తీసుకొని గాలింపు చేపట్టగా భయపడిన దుండగులు అక్కడి నుంచి పారిపోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వారి కోసం వేట కొనసాగుతోంది. మిలిటరీ స్టేషన్‌ను మూసివేసి కార్డన్‌ సెర్చ్‌ చేపట్టినట్లు స్థానిక అధికారులు తెలిపారు. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

ఈ ఘటన సమాచారం అందగానే పంజాబ్‌ పోలీసులు మిలిటరీ స్టేషన్‌ వద్దకు చేరుకున్నారు. అయితే, ఆ ప్రాంతాన్ని ఆర్మీ అధికారులు తమ అధీనంలోకి తీసుకోవడంతో వారిని లోపలికి అనుమతించలేదని బఠిండా సీనియర్‌ ఎస్పీ వెల్లడించారు. కాగా.. కాల్పుల ఘటనలో ఉగ్ర కోణం ఉండే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.

Read more RELATED
Recommended to you

Latest news