“ఆర్ఆర్ఆర్” కు అరుదైన గౌరవం..ఇండియాలోనే తొలి మూవీ !

-

ఎంతో ఆసక్తిగా యావత్ దేశం ఎదురుచుస్తున్న మూవీ ఆర్ఆర్ఆర్. ప్యాన్ ఇండియా సినిమాగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన సంగతి తెలిసిందే. అల్లూరి సీతారామ రాజుగా రామ్ చరణ్ , కోమురంభీంగా జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వీరితో పాటు బాలీవుడ్ యాక్టర్లు అజయ్ దేవ్ గన్, అలియాభట్ నటిస్తున్నారు. జనవరి నెలలోనే ఈ సినిమా విడుదల చేయాల్సి ఉన్నా… కరోనా, ఓమిక్రాన్ మళ్లీ తీవ్రరూపు దాల్చడంతో విడుదలను వాయిదా వేశారు ఫిలిం మేకర్స్.

అయితే ఈ సినిమా ఈనెల 25వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే చిత్ర బృందం సినిమా గురించి ఓ కీలక ప్రకటన చేసింది. మంచి క్వాలిటీ సినిమా చూసిన అనుభూతిని పొందేలా డాల్బీ సినిమా తో కలిపి ఆర్ఆర్ఆర్ మూవీని విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఇలా విడుదలవుతున్న తొలి భారతీయ సినిమాగా ఆర్ఆర్ఆర్ మాత్రమేనని ఈ సందర్భంగా ఓ పోస్టర్ను విడుదల చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news