#RAPO19 : కృతి శెట్టి ఫస్ట్ లుక్ రిలీజ్

స్టైలిష్ గా కనిపిస్తూనే… మాస్ పాత్రలతో అలరించే హీరో రామ్ పోతినేని. దర్శకుడు లింగుస్వామి కూడా మా సినిమాలకు పెట్టింది పేరు. ఇద్దరి కాంబినేషన్ లో సినిమా అనగానే అందరిలోనూ ఆసక్తిని పెంచింది. ద్విభాషా చిత్రంగా తెలుగు మరియు తమిళంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని శ్రీనివాస చిత్తూరి నిర్మిస్తున్నారు.

ఇక ఈ సినిమాలో ఉప్పెన తో ఆకట్టుకున్న కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఊర మాస్ కథతో ఈ చిత్రాన్ని రూపొందిస్తుంది సినీ బృందం. ఇక ఈ సినిమా మా ఈ నెల 12వ తారీకు నుంచి రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభించుకుంది. అయితే తాజాగా ఈ సినిమా నుంచి అప్డేట్ వచ్చింది.

ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న కృతి శెట్టి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసింది చిత్రబృందం. కృతి శెట్టి పుట్టిన రోజు నేడు కావడంతో ఈ పోస్టర్ ను విడుదల చేసింది చిత్రబృందం. ఇక ఈ పోస్టర్ లో చాలా క్యూట్ గా కనిపించింది కృతి శెట్టి. ప్రొడక్షన్ నెంబర్ సిక్స్ పేరుతో ఈ పోస్టర్ ను విడుదల చేసారు.