Breaking : దేశంలో తొలి మంకీపాక్స్‌ కేసు..

-

ఓ వైపు కరోనాతో సతమతమవుతున్న ప్రజలపై వైరస్‌లు దండయాత్ర మొదలుపెట్టాయి. ఇప్పటికే కరోనాతో పాటు జికా వైరస్‌లు దేశంలో వ్యాప్తి చెందుతుండగా.. ఇప్పుడు దానికి మంకీపాక్స్ తోడైంది. ఈ మహమ్మారి తొలికేసు కేరళలో నమోదైంది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వీణాజార్జ్‌ వెల్లడించారు. ఈ నెల 12న యూఏఈ నుంచి తిరువనంతపురానికి వచ్చిన కొల్లాంకు చెందిన వ్యక్తికి మంకీపాక్స్‌ నిర్ధారణ అయినట్లు తెలిపారు వీణాజార్జ్‌. సదరు వ్యక్తికి లక్షణాలు కనిపించడంతో నమూనాలను పూణేలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీకి పంపగా.. పాజిటివ్‌గా తేలిందని వీణాజార్జ్‌ పేర్కొన్నారు.

Monkeypox in India update: Kolkata suspect's test report OUT.. check result  here | India News | Zee News

ఇప్పటికే సదరు వ్యక్తిని ఆసుపత్రిలో చేర్పించినట్లు వీణాజార్జ్‌ తెలిపారు. ఈ నెల 12న తిరువనంతపురానికి వచ్చిన బాధితుడు తొలుత ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లాడు. అనంతరం అక్కడి నుంచి తిరువనంతపురం మెడికల్‌ కాలేజీకి వెళ్లగా.. అనుమానంరావడంతో నమూనాలను సేకరించి పుణేలోని ల్యాబ్‌కు తరలించారు. మరో వైపు కేరళలో మంకీపాక్స్‌ కేసు నమోదవడంతో కేంద్రం అప్రమత్తమైంది. ప్రత్యేకంగా ఓ బృందాన్ని కేరళకు పంపనున్నది కేంద్రం.

 

Read more RELATED
Recommended to you

Latest news