గత ఐదు రోజులుగా ఏపీ ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. దీంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. అంతేకాకుండా.. చెరువులు నిండిపోవడంతో వరద నీరు గ్రామాల్లోకి వచ్చి చేరుతోంది. అంతేకాకుండా జలశయాల్లో సైతం నీరు నిండిపోయి గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఈ నేపథ్యంలో నేడు సీఎం జగన్ ఏపీలో వరద ప్రభావిత ప్రాంతాలను ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరిశీలించనున్నారు. నేడు ఉదయం హెలికాప్టర్ నుంచి ఏరియల్ సర్వే చేపట్టనున్నారు సీఎం జగన్.
ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలోని వరద ప్రభావిత గ్రామాల్లో ఆయన ఏరియల్ సర్వే కొనసాగనుంది. సీఎం ఏరియల్ సర్వే కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు సీఎం జగన్. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలని ఆదేశించారు సీఎం జగన్. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు సీఎం జగన్.