రిటన్ గిఫ్ట్: పార్క్ హయత్ వ్యవహారం… తెలంగాణ ప్రభుత్వ సహకారం?

-

పార్క్ హయత్ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో పెను సంచలనమనే చెప్పాలి. ప్రజలతో ప్రత్యక్ష సంబందాలు లేకుండా రాజకీయాలు చేసేవారికి ఇది చిన్న విషయంగానే కనిపించొచ్చు.. కలిస్తే తప్పేంటి అని వాదించొచ్చు. కానీ.. ఈ విషయంపై ఏపీలో తీవ్ర చర్చలే నడుస్తున్నాయి. ఇంతకాలం వైకాపా నేతలు ఆరోపిస్తుంటే.. “పాపం” అనిపించింది కానీ.. “నిమ్మగడ్డ టీడీపీ మనిషా” అని గ్రామాలలో జనాలు మాట్లాడుకునే వరకూ వ్యవహారం వెళ్లింది!

ఆ మాటలు అలా ఉంటే… రాజకీయ రణరంగంలో “నిమ్మగడ్డ బలిపశువు” అయ్యారని, ఎంత ఐఏఎస్ తెలివి తేటలు అయినా.. రాజకీయ నాయకుల తెలివి తేటల ముందు చిన్నవే అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. రాజ్యాంగాన్ని, న్యాయవ్యవస్థల్నీ త‌న స్వార్థ రాజ‌కీయాల‌కు నిమ్మగడ్డ ఎంతలా దుర్వినియోగం చేస్తున్నాడనేందుకు తాజా స‌మావేశ‌మే నిద‌ర్శ‌నం అనేది మరికొందరి వాదన. ఆ సంగతులు అలా ఉంటే… వైకాపా వేసిన స్కెచ్ కి నిమ్మగడ్డ & కో అడ్డంగా దొరికిపోయారని అంటున్నారు విశ్లేషకులు!

ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేఖలు రాసే స్థాయిలో కక్ష పెంచుకున్నారు అనే విమర్శలు ఎదుర్కొన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్.. హైదరాబాద్ లోనే ఉంటున్న సంగతి తెలిసిందే. అక్కడకూడా ఏపీ ఇంటిలిజెన్స్ ఉంటుందనేది ఆయనకు తెలియని విషయం కాకపోవచ్చు. అయినా కూడా అంత ఓపెన్ గా ఒక హోటల్ కి వెళ్లి రాజకీయ నాయకులను కలవడం.. అంత తెలివైన చర్య కాదని అంటున్నారు.

ఈ విషయంలో… ఎంత పబ్లిక్ ప్లేస్ అని సుజనా – కామినేని వాదించినా.. పార్క్ హయత్ లాంటి ఐదు నక్షత్రాల హోటళ్లను, పబ్లిక్ ప్లేసుల లిస్ట్ లో చేర్చలేరు సామాన్యులు! కాబట్టి… సామాన్య దృష్టిలో ఇది రహస్య మీటింగ్ గానే ఉంది! కాబట్టి… ఇది చట్టబద్దమా, న్యాయబద్దమా, రాజ్యాంగబద్దమా అనే సంగతులు కాసేపు పక్కనపెడితే… ఇది సామాన్యుడి దృష్టిలో ధర్మబద్దం కాదనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

హైదరాబాద్ లో ఎంత ఏపీ ఇంటిలిజెన్స్ ఉన్నా కూడా.. స్థానిక ప్రభుత్వ సహకారం కూడా ముఖ్యమనే మాటలు వినిపిస్తున్నాయి. కాబట్టి… ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వ సహకారం కూడా ఏపీ సర్కార్ కు ఉండి ఉండవచ్చనే గుసగుసలూ వినిపిస్తున్నాయి. ఈ లెక్కన.. ప్రస్తుతం జరిగిన ఈ (రహస్య) భేటీ వ్యవహారంలో గనుక తెలంగాణ సర్కార్ హస్తం ఒకశాతం అయినా ఉండి ఉండొచ్చనే అభిప్రాయాల్లో వాస్తవం ఉంటే మాత్రం… కేసీఆర్, చంద్రబాబుకి ఇంకా రిటన్ గిఫ్ట్స్ ఇస్తున్నట్లే!!

Read more RELATED
Recommended to you

Latest news