వచ్చే వారం 5 రోజులు బ్యాంకులు క్లోజ్.. పనులుంటే చూసేసుకోండి..!

-

బ్యాంకులు ఏయే రోజుల్లో పని చెయ్యవు అనేది చూసుకుంటే ఏ ఇబ్బంది ఉండదు. లేదంటే బ్యాంకు పనులు పూర్తి కావు. పెండింగ్ లో ఉండి పోతాయి. ఒకవేళ కనుక ముందే ఏయే రోజులు సెలవు అనేది తెలుసుకుంటే ఆ పనులు చేసుకోవచ్చు. లేదంటే ముఖ్యమైన పనులు సెలవుల వలన ఆగిపోతాయి. ఈ నెల లో బ్యాంకులు ఏకంగా 12 రోజులు బంద్. ఇదిలా ఉంటే వచ్చే వారం 5 రోజులు బ్యాంకులు బంద్.

మార్చి 7న హోలీ సందర్భంగా బ్యాంకులకు సెలవు. గోవా, ఉత్తరాఖండ్, ఉత్తర్‌ప్రదేశ్, జమ్మూ, శ్రీనగర్, మహారాష్ట్ర, తెలంగాణ, అసోం, రాజస్థాన్, శ్రీనగర్, ఝార్ఖండ్‌లో బ్యాంకులు క్లోజ్.
మార్చి 8న హోలీ రెండో రోజు కారణంగా త్రిపుర, గుజరాత్, మిజోరం, మధ్యప్రదేశ్, ఒడిశా, చండీగఢ్, ఉత్తరాఖండ్, సిక్కిం, రాజస్థాన్ మొదలైన చోట్ల సెలవు.
మార్చి 9న బిహార్‌లో హోలీ సందర్భంగా సెలవు ఉంది.
మార్చి 11 రెండో శనివారం కారణంగా బ్యాంకులు క్లోజ్.
మార్చి 12న ఆదివారం సెలవే.
మార్చి 22న గుడి పడ్వా/ఉగాది కారణంగా ఆంధ్ర, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, మణిపుర్, జమ్మూ, గోవా, బిహార్, శ్రీనగర్‌ లో బ్యాంకులు పని చేయవు.
మార్చి 30న శ్రీరామనవమి. కనుక గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, చండీగఢ్, ఉత్తరాఖండ్, సిక్కిం, తెలంగాణ, ఆంధ్ర, రాజస్థాన్, ఉత్తర్‌ ప్రదేశ్, బిహార్, ఝార్ఖండ్, షిమ్లాల్లో బ్యాంకులకు సెలవు.

 

Read more RELATED
Recommended to you

Latest news