సొంతింటి కలను నెరవేర్చుకోవాలనుకునేవాళ్లు ఈ స్కీమ్ గురించి తప్పక తెలుసుకోవాలి..

-

సొంత ఇల్లు కట్టుకోవాలని అందరికి ఉంటుంది.. అయితే కొందరు బ్యాంకులో రుణాలను తీసుకొని సొంతింటికళను నెరవేర్చుకుంటారు.వాటికి వచ్చే వడ్డీతో ఇబ్బందులు పడుతారు.. అలాంటివారికి కేంద్ర ప్రభుత్వం ఒక స్కీమ్ ను ప్రవేశపెట్టింది. ఆ స్కీమ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

 

తక్కువ మొత్తంలో ఆదాయం ఉన్నవాళ్లకు ఈ స్కీమ్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ స్కీమ్ ద్వారా వడ్డీ రాయితీని పొందవచ్చు. మహిళలకు ప్రయోజనం చేకూర్చాలనే ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ ను అమలు చేస్తుండటం గమనార్హం. ఈ స్కీమ్ ద్వారా హొమ్ లోన్ పొందే అవకాశం ఉండగా ఈ హోమ్ లోన్ కు సబ్సిడీ వడ్డీ రేటు 6.5 శాతంగా ఉంటుందని తెలుస్తోంది. 20 సంవత్సరాల లోన్ తీసుకునే వాళ్లకు ఈ స్కీమ్ ఎంతగానో ప్రయోజకరంగా ఉంటుంది. సీనియర్ సిటిజన్లు, వికలాంగులకు ఈ స్కీమ్ కు సంబంధించి ప్రథమ ప్రాధాన్యత ఉంటుంది..

ఇకపోతే ఈ స్కీమ్ కు చెందిన క్రెడిట్ లింక్డ్ సబ్సిడీని చట్టబద్ధమైన పట్టణాలలో అమలు చేస్తోంది. గరిష్టంగా 6 లక్షల రూపాయల వరకు లోన్ పై ఈ వడ్డీ రేటును పొందే అవకాశం అయితే ఉంటుంది. ఆదాయ వర్గాలను బట్టి లోన్ మొత్తంలో మార్పులు ఉంటాయని చెప్పవచ్చు. సమీపంలో బ్యాంక్ లను, సంబంధిత శాఖల అధికారులను సంప్రదించి ఈ స్కీమ్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవాలి..

మీ అర్హతను బట్టి మీరు 12 లక్షల రూపాయల వరకు కూడా లోన్ ను పొందే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. ఈ గృహ రుణాలపై జీఎస్టీని తగ్గిస్తే బాగుంటుందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. సొంతింటి కలను నెరవేర్చుకోవాలని భావించే వాళ్లకు ఈ స్కీమ్ ద్వారా ఆ కల నెరవేరుతుంది.. మీకు సొంతింటి కల ఉంటే వెంటనే ఈ స్కీమ్ ద్వారా లబ్ది పొందండి..

Read more RELATED
Recommended to you

Latest news