మరి కాసేపట్లో విడుదల కానున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్

-

హైదరాబాద్: దేశంలో నేడు మరో ఎన్నికల నగారా మోగనుంది. నాలుగు రాష్ట్రాలతో పాటు ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి ఎన్నికల తేదీలను కేంద్రం ప్రకటించేందుకు సిద్ధమవుతోంది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల్లో ఎన్నికల నిర్వహణకు శుక్రవారం సాయంత్రం వేళ షెడ్యూల్‌ జారీ చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఐదు రాష్ట్రాల్లో సీఈసీ సునీల్‌ అరోడా, ఎన్నిక కమిషనర్లు సుశీల్‌ చంద్ర, రాజీవ్‌ కుమార్‌, కేంద్ర ఎన్నికల సంఘం పర్యటించింది. ఎన్నికల నిర్వహణపై అధికారులు, రాజకీయ పార్టీలతో ఈసీ చర్చించింది.

election-commission-of-india
election-commission-of-india

పలు దఫాలుగా ఎన్నికల సన్నద్ధతపై రాష్ట్రాల్లో పర్యటించి, ఎన్నికల సన్నద్ధత, శాంతి భద్రతలు, తదితర అంశాలపై ఈసీ అధికారులతో సమీక్షించింది. ఏప్రిల్లో ఈ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఖాళీగా ఉన్న లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలకు కూడా షెడ్యూల్ ప్రకటించనుంది కేంద్ర ఎన్నికల సంఘం. పశ్చిమ బెంగాల్‌లో 294, తమిళనాడులో 234, కేరళలో 140, అసోంలో 126, పుదుచ్చేరిలో 33 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.

వీటితో పాటు దేశంలోని పలు పార్లమెంట్, అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలకు షెడ్యూల్‌ ప్రకటించనున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి పార్లమెంట్, తెలంగాణ‌లో నాగార్జునసాగర్ అసెంబ్లీకి ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది. తెలుగు రాష్టాల్లో ఈ ఉప ఎన్నికలకు ప్రాధాన్యం సంతరించుకున్న విషయం విధితమే. సాయంత్రం కేంద్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశం నిర్వహించనుంది. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి తర్వాత బిహార్‌లో ఎన్నికలు జరగ్గా.. ఆ తర్వాత ఐదు రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు జరగనుండటం ఇదే మొదటిసారి.

Read more RELATED
Recommended to you

Latest news