గ్రీన్ జోన్ టూ గ్రీన్ జోన్… ఫ్లైట్స్ ఓకే…

-

ఇప్పుడు దేశంలో కరోనా లాక్ డౌన్ కారణంగా ప్రజా రవాణా అనేది దాదాపుగా తగ్గిపోయింది అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. విమాన, రైలు రవాణా, బస్సు రవాణా లు పూర్తిగా ఆపేశాయి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు. ప్రపంచ వ్యాప్తంగా కూడా ఇప్పుడు ఇదే పరిస్థితి ఉంది. ఇది పక్కన పెడితే ఇప్పుడు దేశంలో రైలు సర్వీసులు వలస కార్మికుల కోసం ప్రత్యేకంగా నడుస్తున్న సంగతి తెలిసిందే.

ఇక ఇప్పుడు విమాన సర్వీసులను కూడా మొదలుపెట్టే ఆలోచనలో కేంద్ర సర్కార్ ఉందని అంటున్నారు. కేంద్ర సర్కార్… గ్రీన్ జోన్ టూ గ్రీన్ జోన్ లో విమానాలు నడపాలి అని భావిస్తుంది. ప్రయాణికులకు పరిక్షలు చేసిన తర్వాత విమానాల్లోకి అనుమతులు ఇవ్వాలని కేంద్రం భావిస్తుంది. విమాన ప్రయాణం చెయ్యాలి అనుకునే గ్రీన్ జోన్ లో ఉండే వాళ్లకు ఏ ఇబ్బందులు లేవు గాని, ఆరెంజ్ జోన్ లో ఉండే వాళ్ళు పరిక్షలు తప్పనిసరిగా చేయించాలి.

ఉదాహరణకు హైదరాబాద్ ఆరెంజ్ జోన్ ఉంది.శంషాబాద్ లో కేసులు ఏమీ లేవు… హైదరాబాద్ లో కొన్ని ప్రాంతాల్లో కంటైన్మేంట్ జోన్స్ ఉన్నాయి. కంటైన్మేంట్ జోన్ నుంచి ఎవరూ బయటకు రావడానికి వీలు లేదు. ఇతర ప్రాంతాల్లో ఉన్న వారు ధర్మల్ స్క్రీనింగ్ చేయించుకుని విమానం ఎక్కాల్సి ఉంటుంది. దీని మీద అసలు పూర్తి ఆలోచన ఏంటీ కేంద్రానిది అనే విషయం అర్ధం కావడం లేదు. త్వరలోనే కొన్ని ప్రాంతాలకు విమాన సర్వీసులను మొదలుపెట్టడం మాత్రం ఖాయమని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news